LeT terrorist pose as BJP leader held by villagers పైకి బీజేపి నాయకుడిగా బిల్డప్.. లోన ఉగ్రకార్యకలాపాల్లో లింకప్..!

Jammu and kashmir villagers nab two let terrorists with ak 47 in reasi one of them is bjp leader

Jammu and Kashmir, Villagers nab two LeT terrorists with AK 47 in Reasi hand them over to police, latest news updates today, Jammu and Kashmir police, Jammu and Kashmir NEWS, Jammu and Kashmir latest news today, LeT terrorists, lashkar e taiba, lashkar e taiba news, lashkar e taiba updates

In an act of bravery, two heavily armed Lashkar-e-Taiba (LeT) terrorists, including one of its most wanted commanders, were overpowered by villagers and handed over to the police in Jammu and Kashmir's Reasi district, said officials. LeT commander Talib Hussain, a resident of Rajouri district and the mastermind behind the recent IED blasts in the district, and Faizal Ahmad Dar, a categorised terrorist of south Kashmir's Pulwama district, were captured in Tuksan village, they said.

పైకి బీజేపి నాయకుడిగా బిల్డప్.. లోన ఉగ్రకార్యకలాపాల్లో లింకప్..!

Posted: 07/04/2022 11:43 AM IST
Jammu and kashmir villagers nab two let terrorists with ak 47 in reasi one of them is bjp leader

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరిని పోలీసులకు బదులు గ్రామస్థులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్థులకు చిక్కిన ఇద్దరు పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బీజేపీలో క్రీయాశీలక సభ్యుడు కాగా, మరోకరు అతని సహచరడని పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర బీజేపి పార్టీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్ తాలిబ్ హుస్సన్ షా ఉగ్రవాదని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఓ మట్టి ఇంట్లో దాక్కున్న లష్కరే ఉగ్రవాదులైన తాలిబ్ హుస్సన్ షా, అతడి సహచరుడైన ఫైసల్ అహ్మద్ దార్‌‌లను రియాసీ గ్రామస్థులు పట్టుకుని తాళ్లతో బంధించారు. ఆపై పోలీసులకు అప్పగించారు.

వీరి నుంచి రెండు ఏకే 47 తుపాకులు, ఏడు గ్రనేడ్లు, ఒక పిస్టల్, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఒకడైన తాలిబ్ హుస్సేన్ షా జమ్మూలో బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా, పార్టీ క్రియాశీల సభ్యుడిగా ఉన్న విషయం వెలుగు చూసింది. జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీంద్ర రైనాతో తాలిబ్ హుస్సేన్ కలిసి ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

తాలిబ్ షా బీజేపీ క్రియాశీల సభ్యుడున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పఠానియా స్పందించారు. బీజేపీ ఆన్‌లైన్ సభ్యత్వమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వాలు ఇస్తుండడం వల్ల పార్టీలో చేరుతున్నవారు ఎవరో? ఏమిటో? తెలుసుకునే వీలు లేకుండా పోతోందన్నారు. ఉగ్రవాదులు దీనిని చక్కగా ఉపయోగించుకుంటున్నారని, తొలుత పార్టీలో చేరి అందరితో కలిసిపోవడం, ఆపై రెక్కీ నిర్వహించి అగ్రనాయకులను హతమార్చే కుట్రలకు పథక రచన చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దీనికంతటికీ కారణం ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు పార్టీకి లోపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది మే 9న తాలిబ్ షాను జమ్మూకశ్మీర్ ప్రావిన్స్ ఐటీ, సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా బీజేపీ నియమించింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో బీజేపికి వ్యతిరేకంగా పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులను పట్టుకున్న రియాసీ గ్రామస్థుల ధైర్య సాహసాలపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గ్రామస్థులకు రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, జమ్మూ కశ్మీర్ ఏడీజీపీ రూ. 2 లక్షలు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles