రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హాది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, రెండు రోజులు ఇక్కడే ఉంటారన్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర సర్కారు డీజిల్ సహా అన్ని ధరలు పెంచేసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ఇవి చాలదన్నట్లు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారన్నారు. వారి కుటుంబాలకు తాము రూ. 3 లక్షలు ఇస్తే, బీజేపీ తమను చులకనగా చూసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మోదీ..ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే ప్రధాని మోదీని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీపాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు. మోదీ ప్రధానిగాకాదు..దోస్త్ కోసం షావుకార్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా..విదేశాల నుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తున్నదని ఆయన మండిపడ్డారు. మోదీపై దేశప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ఎద్దేవా చేశారు. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మీరు దేశం ముందు తలదించుకున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.
తాము అడిగిన ప్రశ్నలకు ప్రధాని ఇక్కడే సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మోదీని చూసి పెద్దపెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. రూపాయి పతనం చూస్తే మోదీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. మోదీ షావుకార్ల సేల్స్‌మేన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్దమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ విధానాలతోనే తమకు అభ్యంతరం తప్ప వ్యక్తిగతమేమీ లేదని పేర్కొన్నారు. తాము ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more