Shiv Sena rebels sold for Rs 50 crores: Samna రెబల్ ఎమ్మెల్యేల వెనుకనున్న అదృశ్యశక్తి బీజేపినే: శివసేన

Shiv sena calls rebel mlas nachnia bjp has instigated them saamana

Shiv Sena, Samna, Saamana, Y category Security, Devendra Fadnavis, Amit Shah, Eknath Shinde, political Crisis, Uddhav Thackeray, Maharashtra Political Crisis, Political Crisis, Election Special, Shiv Sena, Eknath Shinde, Eknath Shinde News, Maharashtra Political Crisis Update, Uddhav Thackeray Government, Rebel MLAs, backstabbed politics, Uddhav Thackeray backstabbed, Maharashtra Politics

Shiv Sena has targeted the Center for giving y + security to the rebel MLAs. Shiv Sena has written in the editorial of its mouthpiece Saamana that the BJP's pole has finally been exposed in the Guwahati matter. It was written in Saamana that the BJP was constantly saying that the rebellion of the MLAs is an internal matter of Shiv Sena. But now it is being told that Eknath Shinde and Devendra Fadnavis had a secret meeting in Vadodara in the dark. Home Minister Amit Shah was present in this meeting.

రెబల్ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు.. వై భద్రత: శివసేన సంచలన అరోపణ

Posted: 06/27/2022 12:46 PM IST
Shiv sena calls rebel mlas nachnia bjp has instigated them saamana

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి.. రెబెల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడంతో వారి వెనుకనున్న అదృశ్యబలం ఎవరో దేశప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఏక్‌నాథ్‌ షిండే ఇంతలా డబ్బును ఇస్తున్నారన్న అరోఫణలు వస్తే మాత్రం కేంద్రంలోని ఏ మంత్రి నోరు విప్పరు. కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కూడా కళ్లు, చెవులు అప్పగించి చూస్తున్నాయే తప్ప మరే చర్య తీసుకోవడం లేదెందుకని అని శివసేన ప్రశ్నించారు. కేంద్రం చర్యలపై స్పందించిన సామ్నా సంపాదకీయంలో బీజేపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘‘బీజేపి అసలు రంగేంటో ఇప్పుడు బయటపడింది. శివసేనలో తిరుగుబాటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కాషాయ పార్టీ పైకి చెబుతోంది. కానీ, తెరవెనుక ఏక్‌నాథ్‌ షిండే, దేవేంద్ర ఫడణవీస్‌ వడోదరలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారని అరోపించింది.

ఈ సమావేశం తరువాతే రెబల్‌ ఎమ్మెల్యేలకు వై ప్లస్‌ భద్రతను కేంద్రం కల్పించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపినే కారణమని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఉంటుందా..? బీజేపీనే ఆ నటులకు(రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ) స్క్రిప్ట్‌ రాసి ఈ మొత్తం నాటకానికి దర్శకత్వం వహించింది’’ అని శివసేన దుయ్యబట్టింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ పార్టీ ఆరోపించింది. రెబల్ ఎమ్మెల్యేలకు డబ్బు సమకూర్చింది కూడా బీజేపీనేనని, పైకి నీతిమంతులుగా చెలమాణి అవుతూ లోలోపల దుర్నీతిని అవలంభిస్తున్నారని శివసేన నేతలు అరోపించారు.

షిండే వర్గ రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సమయంలో కన్నాడ్ శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సింగ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గం తనకు రూ.50కోట్లు ఆఫర్‌ చేసిందని ఆరోపించారు. ‘‘తిరుగుబాటు చేసిన శిందే శిబిరం నన్ను కూడా తమతో పాటు రమ్మని ఒత్తిడి చేసింది. పదే పదే ఫోన్లు చేసి నన్ను బలవంతపెట్టేందుకు వారు ప్రయత్నించారు. దీంతో నేను ఫోన్ స్విచ్చాఫ్‌ చేసుకున్నా. ఆ తర్వాత కొంతమంది కారులో నా దగ్గరకు వచ్చారు. అందులో రూ.50కోట్ల డబ్బు ఉన్నట్లు చెప్పారు. కానీ నేను వారికి ఒకటే చెప్పాను. ఠాక్రే కుటుంబం, శివసేన పార్టీకి నేనెప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నాను’’ అని ఉదయ్‌ సింగ్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles