Heavy rain likely in Telangana on June 30: Met తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు

Imd predicts moderate rainfall in parts of andhra pradesh telangana for next four days

Rains lashed several districts in Andhra Pradesh and Telangana due to the southwest monsoon. The India Meteorological Department (IMD) said the low-pressure area was between 3.1 km and 5.8 km above sea level. Andhra Pradesh's coastal and Rayalaseema districts will receive moderate rains four days from Monday, predicted IMD. There is a chance of light to moderate rain in several parts of Telangana for the next two days.

The city of Hyderabad had experienced the thunderstorm with heavy rains and winds in the wee of Sunday. It is reported that IMD- Hyderabad,

తెలంగాణకు వర్షసూచన.. రానున్న నాలుగు రోజులు వర్షాలు..

Posted: 06/27/2022 11:37 AM IST
Imd predicts moderate rainfall in parts of andhra pradesh telangana for next four days

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 ,40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉంది. అదిలాబాద్, కుమరం భీమ్, అసిఫాబాద్, మంచర్యాల, నిర్మల్, నిజమాబాద్, జైశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహభూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కోంది. .

అటు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణలో నిన్న మధ్యాహ్నం, రాత్రి పలుచోట్ల భారీవర్షాలతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు వర్షాల కారణంగా నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  heavy rains  rainfall  Hyderabad  light to moderate rain  weather updates  Telangana  weather news  

Other Articles