Over 56k applications received for IAF Agniveer recruitment అగ్నిపాథ్ పథకానికి స్పందన ఇలా.. వాయుసేనలో భర్తీ కోసం 3 రోజుల్లో..

Agneepath scheme gets good responce over 56k applications received for iaf agniveer recruitment

agneepath recruitment 2022, agnipath recruitment 2022, agniveers, agnipath scheme, agnipath scheme news today, agneepat scheme news, agnipath iaf recruitment, agneepath indian air force recruitment, agnipath air force recruitment, agnipath iaf applications, indian air force, agniveervayu, agnipath protests news, agnipath layest news

Agneepath Scheme Recruitment 2022 is underway for the Indian Air Force. As per the latest update from officials, the IAF has received over 56 thousand applications from future Agniveers under the IAF Agniveer Recruitment 2022. It seems that the Agnipath Scheme has got a thumbs up from people!.

అగ్నిపాథ్ పథకానికి స్పందన ఇలా.. వాయుసేనలో భర్తీ కోసం 3 రోజుల్లో..

Posted: 06/27/2022 01:49 PM IST
Agneepath scheme gets good responce over 56k applications received for iaf agniveer recruitment

ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో ఈ పథాకానికి పెద్దగా స్పందన ఉండదన్న వాదనలు పటాపంచలయ్యాయి.

అగ్నీపాత్ పథకానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. దేశంలోని నిరుద్యోగ సైనిక ఉద్యోగ అశావహుల నుంచి మూడు రోజుల్లోనే అరలక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు వాయుసేన విభాగం అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో అగ్నిపాథ్ వాయు లో ఏకంగా 56,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా, దరఖాస్తు ప్రక్రియ జులై 5న ముగియనుండడంతో లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటిస్తారు. ఈ నెల 14న కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించగా, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి.

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మకంగా మారాయి. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న యువత ‘అగ్నిపథ్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఇక ఎంపికయ్యాక నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. అయితే, ఎంపికైన వారిలో 25 శాతం మందిని మాత్రం పూర్తిస్థాయి ఉద్యోగులుగా తిరిగి తీసుకుంటారు. వారు 15 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందిస్తారు. కాగా, ఈ ఏడాది మాత్రం 23 ఏళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles