ధేశంలో మరోమారు కరోనా మహమ్మారి ప్రమాద గంటికలు మ్రోగిస్తోంది. మొన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో ఆ రాష్ట్రంలో కరోనా అంక్షలను అమలు చేయడంతో పాటు జనసామర్థ్యం కలిగిన ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ప్రభుత్వం ముందస్తుచర్యలు చేపట్టింది. మిలియన్ మార్కును దాటి యాక్టివ్ కేసులు ఉన్న రెండో రాష్ట్రం మహారాష్ట్ర. కేరళలో ప్రతి 10 లక్షల మందికి 264 యాక్టివ్ కేసులు ఉంటే, ముంబైలో అది 53 కేసులుగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.5 శాతానికి చేరుకోగా (పరీక్షల్లో పాజిటివ్ గా తేలుతున్న కేసులు).. ముంబైలో మాత్రం 8.8 శాతం, పాల్గర్ లో 4.9 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది. అంటే ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర సగటు పాజిటివ్ రేటును దాటిపోయాయి. థానే పట్టణంలో పాజిటివిటీ రేటు సోమవారం 20 శాతంగా నమోదైంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు ఉన్నందున పరీక్షల సంఖ్యను ముంబైలో పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. తాజాగా కర్ణాటకలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే దేశంలో కరోనా మహమ్మారి నాలుగో దశ రానుందా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ తరువాత కర్ణాటకలోనూ మళ్లీ కరోనా కేసులు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అన్ని అప్రమత్తంగా ఉండాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది.
అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. అలాగే, మాల్స్ సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై తప్పనిసరి చేసి.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. కాగా, నిన్న కర్ణాటకలో 300 కేసులు నమోదై్య్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 06 | ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను... Read more
Aug 06 | మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్... Read more
Aug 05 | కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితిలో మేం ఉన్నాం. సంవత్సర... Read more
Aug 05 | లోకంలో తల్లి ప్రేమను మించింది లేదు. తన పంచప్రాణాలను పణంగా పెట్టైనా సరే తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇది సకల చరాచర సృష్టిలో అన్ని జీవులకు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా మన వరకు... Read more
Aug 05 | దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంపు,... Read more