సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరి పని వారు చేసుకోవడం మానేసి.. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖ వ్యక్తుల గురించి వాకాబు చేయడం.. వారు ఆసుపత్రి పాలయ్యారని అసత్యవార్తలను తెరపైకి తీసుకురావడం ఈ మధ్యకాలంలో మరీ విపరీతం అయిపోయింది. అదే పనిగా పెట్టుకుని సైతం పలువురు ఈ పనులు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (86) విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఆయన కుటుంబసభ్యులు అసుపత్రులలో చేర్పించారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలను ధర్మేంద్ర కొట్టిపడేశారు. ఈ మేరకు ఆయన ఓ విడీయోను విడుదల చేశారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో వాటిపై స్వయంగా ధర్మేంద్ర తన సామాజిక మాద్యమాల వేదికగా స్పందించారు. అటు ఇన్ స్టా్గ్రామ్, ఇటు ట్విట్ట్‌ర్ వేదికగా ఈ విడియోను విడుదల చేశారు. ఈ వీడియోలలో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆ వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా లేనని స్పష్టం చేశారు. ‘‘బి పాజిటివ్, థింక్ పాజిటివ్, లైఫ్ విల్ బి పాజిటివ్’’ అంటూ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు.
ఇతరులకు ప్రేమను పంచితే జీవితం అందంగా ఉంటుందన్న ధర్మేంద్ర.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన కుమారుడు బాబీడియోల్ కూడా ఖండించారు. కాగా, నెల రోజుల క్రితం ధర్మేంద్ర రొటీన్ చెకప్‌లో భాగంగా బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లారు. అప్పట్లో ఆయన ట్విట్టర్ ద్వారా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందీ వెల్లడించారు. నడుం నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లానని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో స్పందించి వివరణ ఇచ్చారు.
భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, యాదోం కీ బారాత్, సత్యకామ్, సీతా ఔర్ గీతా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కరణ్ జొహార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహనీ’ సినిమాలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఇందులో జయాబచ్చన్, షబానీ ఆజ్మీ, అలియా భట్, రణ్వీర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Friends, With Love to You Allpic.twitter.com/o4mXJSBDyF
— Dharmendra Deol (@aapkadharam) June 6, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more