RBI rejects reports of replacing Gandhi on currency note కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీ ఫోటో మార్చే ప్రతిపాదనేదీ లేదు: ఆర్బీఐ

Rbi junks report claiming replacement of mahatma gandhi s photo on bank notes

RBI, Reserve Bank of India, Bank Notes, currency notes, indian currency, new bank notes, Mahatma Gandhi, images of Mahatma Gandhi on Indian note, Bank notes, Indian Currency, currency notes, Mahatma Gandhi, Gandhiji Image, Indian economy

The Reserve Bank of India (RBI) announced that there will be no change in the existing currency notes. The bank clarified that it is not contemplating any change in currency and banknotes by replacing the face of Mahatma Gandhi with the face of others.

కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీ ఫోటో మార్చే ప్రతిపాదనేదీ లేదు: ఆర్బీఐ

Posted: 06/06/2022 07:05 PM IST
Rbi junks report claiming replacement of mahatma gandhi s photo on bank notes

క‌రెన్సీ నోట్ల‌పై జాతీపిత మ‌హాత్మా గాంధీ చిత్రానికి బ‌దులుగా వేరే ముఖచిత్రాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌, మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ఫొటోల‌తో కొత్త క‌రెన్సీ నోట్ల‌ను ముద్రించ‌నున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆర్బీఐ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఇలాంటి ప్రతిపాదనేదీ తమ పరిధిలో కూడా లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. త‌మ వ‌ద్ద ఎలాంటి కొత్త ప్ర‌తిపాద‌న లేద‌ని ఆర్బీఐ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ యోగేశ్ ద‌యాళ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అంతేకాదు ట్విటర్‌లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. ప్రస్తుతం ఉన్న కరెన్సీపై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను కరెన్సీపై ముద్రించేందుకు ఆర్బీఐ సన్నధం అవుతుందన్నట్లుగా వార్తలు వచ్చాయి.

దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్బీఐ త్వరలోనే కీలకమైన ముందడుగు వేయవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. క‌రెన్సీ నోట్ల‌లో మ‌రిన్ని మేర సెక్యూరిటీ ఫీచ‌ర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ స‌హానికి గాంధీ స‌హా ఠాగూర్‌,క‌లాం ఫొటోల‌ను ఆర్బీఐ పంపింద‌ని, కరెన్సీ నోట్ల‌పై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్‌, క‌లాం ఫొటోల‌ ముద్ర‌ణ‌కు సంబంధించి ఆయ‌న నుంచి నివేదిక కోరింద‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన యోగేశ్ ద‌యాళ్ ఆ వార్త‌ల‌ను ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Bank notes  Indian Currency  currency notes  Mahatma Gandhi  Gandhiji Image  Indian economy  

Other Articles