Groom Faints On Wedding Altar After Bride Rejects Marriage తాళి కట్టే వేళ.. పెళ్లి వద్దన్న వధువు.. సృహతప్పిన వరుడు

Groom faints on wedding altar after bride rejects marriage

bride, Groom, Groom unconscious, Groom unconscious during marriage, Balasore Marriage, Bride Rejected Marriage in Balasore, Groom Faints On Wedding Altar, bride beaten by family members, bride confess secret marraige, bride already has husband, last minute of wedding, nuptial knot ceremony, Remu village, Baliapal police limits, Balasore district, Odisha, social media, Viral video

Expressing her unwillingness to marry, a bride refused to marry her groom on the wedding day Following such an act of the bride, the groom fell unconscious at the wedding altar. The incident occurred at Remu village under Baliapal police limits in Balasore district. The video of the incident has gone viral on social media platforms.

ITEMVIDEOS: తాళి కట్టే వేళ.. పెళ్లి వద్దన్న వధువు.. సృహతప్పిన వరుడు

Posted: 05/20/2022 07:57 PM IST
Groom faints on wedding altar after bride rejects marriage

ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా.. అక్కడ ఆసీనులైన అతిధుల చూపులు వెళ్లాయి. ఈ లోగా అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని.. ఆపండీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందీ అని కళ్యాణ వేదిక వైపు చూడసాగారు. ఈ పెళ్లిని ఆపాలని స్వయంగా వదువే ఆపండీ అని అరవడంతో అక్కడున్నవారంతా విస్మయం చెందారు. ఏం జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు.

పెళ్లికార్యం ప్రారంభమైనప్పటి నుంచి ముభావంగానే ఉన్న వదువు.. సరిగ్గా వరుడు తాళి కట్టే సమయంలో ‘ఆపండీ’అంటూ తనకు తాళి కట్టవద్దని వరుడికి చెబుతుంది. అంతేకాదు ఉన్న‌ట్టుండి త‌న‌కు పెళ్లి ఇష్టం లేద‌ని బాంబు లాంటి మాట చెప్పింది. వెంటనే తన చేతికి వున్న గాజులను తీసివేసింది. త‌న‌కు అప్ప‌టికే వేరే వ్య‌క్తితో పెళ్లి అయిపోయింద‌ని.. తనకు భర్త కూడా ఉన్నాడని వ‌ధువు చెప్పేసింది. తనకు అందమైన భార్య వస్తుందనుకుని.. ఇక అమె మెడలో తాళి కూడా కట్టేస్తున్నానని అనుకున్న వరుడు.. వధువు ఇచ్చిన అనుకోని షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

తాళి కట్టే సమయం కాబట్టి వరుడి పక్కనే అతని బంధువులు చేరారు. మరికొన్ని క్షణాల్లో గడిస్తే అమె తన భార్య అవుతుంది అన్న సమయంలో.. ఎదురైన  హఠాత్పరిణామంతో వరుడు సృహకోల్పోయాడు. అయితే అతడ్ని చూసి వధువు జాలి పడటం తప్ప.. మరేం చేయలేని పరిస్థితి. తనకు అప్పటికే పెళ్లైందని, భర్తకూడా ఉన్నాడని చెప్పడంతో.. అప్పటి వరకు మిన్నకుండాపోయి.. అప్పుడే ఎందుకు చెప్పావని, ముందే ఈ విషయాన్ని చెప్పాల్సింది కదా.? అంటూ అమె తల్లిదండ్రులు, సోదరులు అమెపై చేయిచేసుకున్నారు. పెళ్లి మండంపైనే చెంప‌లు వాయించారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  Groom  Groom unconscious  nuptial knot  bride husband  Balasore district  Odisha  social media  Viral video  

Other Articles