రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రభావంతోనే సౌత్ ఆఫ్రికా, యూకే తదితర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగాయని వైద్య అరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, మాస్క్ ధరించాలని సూచనలు చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్టింగ్ కిట్లను సప్లై చేసింది.
అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఒమిక్రాన్ వేరియంట్ బిఏ 4 పట్ల అప్రమత్తంగా ఉండాలని అదేశాలను జారీ చేసింది. ఇక జిల్లాల్లో తీవ్రతను బట్టి కట్టడి చర్యలను స్పీడప్ చేస్తామని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా, యూనైటెడ్ కింగ్ డమ్ దేశాల నుంచి వచ్చినవాళ్లను స్ర్కీనింగ్ పరీక్షలు చేసిన తరువాత కూడా వారిని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ లేనందున క్వారంటైన్, నెగిటివ్ ఎంట్రీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఓ అధికారి స్పష్టం చేశారు. ఇక ఈ కేసుల సంఖ్య పెరిగితే కేంద్రప్రభుత్వమే చర్యలకు పూనుకుంటుందని అన్నారు.
కరోనా మహమ్మారిలో అత్యల్ప లక్షణాలు కలిగిన ఒమిక్రాన్ వేరియంట్ లోని బిఏ1, బిఏ 2లతో పాటు పలు రకాలు ఇప్పటికే దేశంలో వెలుగుచూడగా, కొత్తగా జన్యుపరంగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘బిఏ 4’ వెలుగుచూడటంతో సర్వత్రా అందోళన రేకెత్తింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుందని ఇప్పటికే పలు వేరియంట్లు రూడీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ బీఏ4 వేరియంట్ ఇంతకుముందు కరోనా మహమ్మారి బారిన పడిన వాళ్లకు కూడా సోకే ప్రమాదముందని, వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేయడం ఆందోళనకరం. అయితే లక్షణాలు తీవ్రంగా లేవని చెప్పడం ఉపశమనం కలిగించే అంశం.
కరోనా కొత్త వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేదు. అయితే హైదరాబాద్‌లోని వ్యక్తికి బీఏ 4 సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ వ్యక్తి దక్షిణా ఆఫ్రికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఓ సమావేశానికి హాజరై వెళ్లిపోయాడు. ఈ సమావేశంలో 24 మంది పాల్గొనగా, వారందరినీ గుర్తించి టెస్టులు చేశాం. అందరికీ నెగిటివ్ వచ్చింది. కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో కూడా ఉంచాం. ఇదంతా పది రోజుల క్రితం జరిగింది. అనవసరంగా తప్పుడు వార్తలు క్రియేట్ చేసి జనాలను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదు. మరోవైపు చాలా మంది బూస్టర్ డోసుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కొత్త వేరియంట్లు వ్యాప్తికి చెక్ పెట్టేందుకు మరో ఏడాది పాటు బూస్టర్ వ్యాక్సిన్లు అవసరం.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more