SC panel says book 10 cops for killing 4 accused ‘దిశ’ఎన్‌కౌంటర్‌: 10మంది పోలీసులపై 302 కేసులు పెట్టాల్సిందే.!

Disha encounter fake book 10 cops for murder says supreme court panel

vs sirpurkar, v s sirpurkar commission, supreme court, ipc, Hyderabad, disha case, 2019 Disha rape and murder case, disha accused case, disha encounter case, Supreme court pannel, sc appointed commission, murder case, 10 police men, 2019 November 28 case, 2019 december 6th encounter case, Shamshabad, Rangareddy, cyberabad commissioner, Telangana, Crime

The four accused in the 2019 Disha rape and murder case were killed in a fake encounter while in police custody and the 10 cops involved in it should be booked for murder, the Supreme Court-appointed commission to inquire into the killings has said in its report submitted to the apex court. It also concluded that three of the four accused were minors while holding the cops responsible for destroying or withholding evidence.

‘దిశ’ఎన్‌కౌంటర్‌: 10మంది పోలీసులపై 302 కేసులు పెట్టాల్సిందే.!

Posted: 05/20/2022 06:50 PM IST
Disha encounter fake book 10 cops for murder says supreme court panel

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్‌ లాల్‌ మదర్, మహమ్మద్‌ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్‌.అరవింద్‌ గౌడ్, డి.జానకిరామ్, ఆర్‌.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌.. ఈ పది మంది పోలీసులపై హత్యానేరం కింద ఐపీసీ సెక్షన్ 302 కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది.

కమిషన్‌ జనవరి 28నే సీల్డు కవర్‌లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ సెక్రటేరియట్‌ ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్‌ తమ నివేదికలో ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఘటన ప్రాంతానికి సంబంధించి అందిన కొన్ని వీడియో ఫుటేజీలు ఆర్డర్‌లో లేవని. పైగా అవి నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్‌లని తెలిపింది. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయని పేర్కోంది.

సెక్షన్‌ 161 సీఆర్‌పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్‌ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్‌ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనా స్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్‌ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది.

పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్‌ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్‌ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్‌ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్‌ రికార్డులో, మెడికో లీగల్‌ సర్టిఫికెట్‌లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్‌లో వారిని కేర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్‌ చేసినట్టు ఉంది. పోలీసుల చికిత్సకు సంబంధించి ఒరిజినల్‌ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్‌ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles