India Reports First Case Ba.4 Omicron Variant హైదరాబాదులో హైఅలర్ట్.. కరోనా కొత్తవేరియంట్..

India s first case of omicron subvariant ba 4 detected in hyderabad

CDC, BA.4, BA.5, Omicron subvariants, Omicron variant, BA.2, Europe, Portugal, European Centre for Disease Prevention and Control, Covid-19 coronavirus, BA4 Omicron variant, COVID, ECDPC, Hyderabad, India, INSACOG, Omicron Variant, Coronavirus Variant India, COVID19, Omicron, Omicron subvariant BA.4, Omicron, Hyderabad, South Africa, WHO, Coronavirus

The first case of BA.4 subvariant of Omicron has been detected in India in Hyderabad through India’s COVID-19 genomic surveillance programme. This sub-variant, along with BA.5, another subvariant of Omicron, has been causing a major wave of fresh coronavirus infections in South Africa and has now been reported in several other countries including the US and the UK.

హైదరాబాదులో హైఅలర్ట్.. కరోనా కొత్తవేరియంట్ బిఏ4 గుర్తింపు

Posted: 05/20/2022 11:33 AM IST
India s first case of omicron subvariant ba 4 detected in hyderabad

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలు దేశాలలో ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారి.. భారత్లో మాత్రం రెండుదశలకే పరిమితం అయ్యిందని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో కరోనా వాక్సీన్ లు దేశప్రజలందరికీ వేగవంతంగా ఇవ్వడంతో దోహదపడటంతో దానిని నియంత్రించ గలిగామని వైద్యనిపుణులు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో ఐఐటీ అధ్యయనాలు మాత్రం జూన్ నెలలో మళ్లీ కరోనా మూడవ దశ విస్తరించే అవకాశాలు ఉన్నాయిని కూడా స్పష్టం చేశాయి. అయితే తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. ఐఐటీ నిపుణులు చెప్పిందే వాస్తవమా.? అన్న అందోళన సర్వత్రా నెలకొంది.

వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు.. ఇప్పటికే అటు దక్షిణాఫ్ఱికా, చైనా, యూనైటెడ్ కింగ్ డమ్ లలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  అయితే ఇవన్నీ బిఏ 1, భిఏ 2 సహా పలు వేరియంట్లు. కానీ తాజాగా హైదరాబాద్‌లో ఒమిక్రాన్ బిఏ 4 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. కరోనా బారినపడిన వారికి, ఇప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది.

అయితే, ఇది ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఎ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరిగినా ఉద్ధృతి మాత్రం తక్కువగానే ఉంటుందని అంటున్నారు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు దాదాపు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID19  Omicron  Omicron subvariant BA.4  Omicron  Hyderabad  South Africa  WHO  Coronavirus  

Other Articles