Ready for talks with Maoists, but on condition: Bhupesh Baghel ఆ ఒక్కటి చేస్తే.. నక్సలైట్లతో చర్చలకు సిద్దం: సీఎం

Bhupesh baghel says ready for talks with maoists but on 1 condition

maoist peace talks, chhattisgarh Cm, Bhupesh baghel, chhattisgarh maoists, maoists, faith in Constitution, Indian Constitution, chhattisgarh, Crime

Two weeks after Maoists in a statement claimed that they are willing for peace talks but also set several conditions, Chhattisgarh chief minister Bhupesh Baghel on Thursday said that peace talks with Maoists is only possible if they express faith in the Constitution. Baghel further said that he can come to Sukma or anywhere they (Maoists) want but they should first accept the Constitution of India.

మావోలతో చర్చలకు రెడీ.. రాజ్యాంగంపై విశ్వాసాన్ని ప్రకటిస్తేనే: సీఎం

Posted: 05/20/2022 12:23 PM IST
Bhupesh baghel says ready for talks with maoists but on 1 condition

ప్రజల పక్షాన నిలుస్తూనే తాము అడవుల బాట పట్టామని ప్రకటించుకునే నక్సలైట్లతో శాంతి చర్చలకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం సిద్దమని సంకేతాలను ఇచ్చింది. అయితే శాంతి చర్చలకు ముందు వారు భారత రాజ్యంగంపైన తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. సుక్మా జిల్లాలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు రెడీ అన్న మావోల ప్రకటనపై మాట్లాడుతూ.. చర్చలకు తామూ సిద్ధమేనని, అయితే వారు రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటించాలని అన్నారు.

చర్చలకు బస్తర్ కంటే మంచి ప్రదేశం మరోటి ఉండదన్నారు. మావోయిస్టులు చర్చలు జరపాలంటే ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం సుక్మాప్రాంతంలోనే మొదలైందని, ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సుక్మానే కాదు, ఎక్కడైనా చర్చలకు రెడీయేనని స్పష్టంచేశారు. అయితే, భారత రాజ్యంగంపై నక్సలైట్లు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడం అంటూ మెలిక పెట్టారా.. అన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

కాగా, జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ఇటీవల మావోలు ప్రకటించారు. అయితే ముందుగా చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పర్చిన తరువాతనే చర్చలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి పేర్కెన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం బఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆ రాష్ట్ర హోం మంత్రి తామరద్వాజ్ సాహూ కూడా నక్సలైట్లతో బేషరతు చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles