ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది. అధికారమే పరమావదిగా భావిస్తున్న ఎన్సీపీ మిత్రపక్షాన్ని నమ్మకద్రోహం చేసేందుకు కూడా వెనుకాడటం లేదని అరోపించింది. మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్సీపి ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపితో జతకట్టిందని సంచలన అరోపణలు చేశారు.
మిత్రపక్షంగా కోనసాగుతూనే.. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ ను బలహీన పర్చే చర్యలకు పూనుకుంటున్న ఎన్సీపి వ్యవహారాలపై తమ పార్టీ హైకమాండ్‌కు విషయం నివేదించానని ఆయన చెప్పుకొచ్చారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన ఆపై ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, గత రెండున్నరేండ్లుగా మహారాష్ట్రలో తమ పార్టీని ఎన్‌సీపీ బలహీనపరుస్తోందని ఆయన నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ నానా పటోలె వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు ఇతర స్ధానిక సంస్ధలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. గొందియా జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎన్‌సీపీ బీజేపీతో చేతులు కలిపిందని అన్నారు. భివాండి-నిజాంపూర మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్‌సీపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను తాము పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చామని, అయితే రానున్న రోజుల్లో పార్టీ మహారాష్ట్ర సర్కార్ పై కూడా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ఉదయ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన పార్టీ చింతన శిబిరంలో ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ ఆగస్ట్, సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని నానా పటోలె తెలిపారు. రాహుల్ గాంధీని తమ నేతగా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. ఈ ఎన్నిక పూరైన తరువాత కాంగ్రెస్ మహావికాస్ ఆఘడి సర్కార్ పై దృష్టిసారిస్తుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా రాష్ట్ర నాయకత్వం బలమైన ప్రణాళికలను రూపోందిస్తుందని.. వాటిని అములు పర్చడంతో రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవాన్ని కోనసాగిస్తుందని విశ్వాసన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more