NGT seeks report from UP, Bihar on bodies found floating in Ganga గంగానదిలో తేలిన కరోనా శవాల లెక్కలు చెప్పండీ: ఎన్జీటీ

National green tribunal asks bihar uttar pradesh for data on bodies found floating in ganga

National Green Tribunal, Bihar, Uttar Pradesh, data, dead bodies, floating in Ganga, Ganga River, corona pandemic, ganga dead bodies, ganga corspse burial, NGT notices to uttar pradesh, NGT notices to bihar, Covid-19, Count of corona dead bodies in River Ganga

The National Green Tribunal sought reports from the state governments of Uttar Pradesh and Bihar whether Covid-19 protocols were followed while cremating/burying bodies during the coronavirus pandemic. The tribunal asked the states to include in the report the details of the bodies buried on the banks of River Ganga, beginning from 2018 and up till March 31 this year.

గంగానదిలో తేలిన కరోనా శవాల లెక్కలు చెప్పండీ: యూపీ, బిహార్ ల‌కు ఎన్జీటీ తాఖీదులు

Posted: 05/17/2022 12:28 PM IST
National green tribunal asks bihar uttar pradesh for data on bodies found floating in ganga

కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామన్న భయాందోళన మధ్య కరోనా తొలి దశలో దేశప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించారు. అయినా భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా నమోదు కావడంతో దేశప్రజల్లో మరింత అందోళన పెరిగింది. అయితే ఏకంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించడంతో అన్ లాక్ తో ఒక్కసారిగా ప్రజలకు స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది. అయితే అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చిన వాక్సీన్లు.. కరోనా చికిత్సకు మందులు రావడంతో.. ప్రజల్లో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా అలుముకుంది.

దీంతో క‌రోనా మహమ్మారి రెండవ దశలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతున్నా పట్టించుకున్న దిశగా ప్రజలు అప్రమత్తం కాలేదు. దీంతో దేశవ్యాప్తంగా రెండో దశ మరణ మృదంగాన్ని లిఖించింది. వందలు, వేలు దాటి లక్ష మార్కు దిశగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కడపడితే అక్కడ కరోనా మృతదేహాలు దర్శనమిచ్చాయి. రోడ్డ పక్కన, నదుల్లో, ఇలా భయపడుతున్న ప్రజలపై మరో పెనుభారం పడినట్టుగా పరిస్థితి మారింది. కాగా, సెకండ్ వేవ్  స‌మ‌యంలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గంగా న‌దిలో అనేక శ‌వాలు కుప్ప‌లు కుప్ప‌లుగా తేలాయి. మ‌ళ్లీ ఇప్పుడు ఈ విష‌యం తెర‌పైకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ సీరియ‌స్‌గా తీసుకుంది. కరోనా రెండు దశల్లో ఎన్ని శ‌వాలు గంగాన‌దిలో తేలాయో.. లెక్క‌లు చెప్పాలని ఇరు రాష్ట్రాల‌ను గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశించింది. జ‌స్టిస్ అరుణ్ కుమార్ త్యాగీ, ఎన్జీటీ స‌భ్యుడు డాక్ట‌ర్ అఫ్‌రోజ్ అహ్మ‌ద్ ధ‌ర్మాస‌నం దీనిపై ఇరు రాష్ట్రాల‌ను వివ‌ర‌ణ కోరింది. ఈ మేర‌కు ఇరు రాష్ట్రాల హోంశాఖ కార్య‌ద‌ర్శి, ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శుల‌ను ఆదేశించింది. కోవిడ్ ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి మొద‌లు పెడితే, 2020, 2021 సంవత్స‌రాలు, ఈ యేడాది మార్చి 31 వ‌ర‌కూ ఎన్ని కోవిడ్ శ‌వాలు గంగ‌లో తేలాయో లెక్క‌లు చెప్పాల‌ని తాఖీదులు పంపింది. అంతేకాకుండా కోవిడ్ శ‌వాల‌ను కాల్చ‌డానికి ఎంత మందికి ఆర్థిక స‌హాయం చేశారో కూడా చెప్పాల‌ని ఎన్జీటీ ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles