BJP leader Vinayak Ambekar assaulted by angry NCP బీజేపి నేతపై దాడి.. దిద్దుబాటు చర్యలకు దిగిన ఎన్సీపీ..

Pune police register case against 4 ncp leaders for slapping bjp leader vinayak ambekar

BJP spokesperson, Vinayak Ambekar, assault case, NCP workers, derogatory post, facebook post, NCP Chief Sharad Pawar, NCP, vinayak ambekar, BJP spokesperson, ncp activists, pune, ambekar assaulted, maharashtra bjp, sharad pawar, NCP Chieg, BJP vs NCP, maharashtra, Politics

The Maharashtra police are yet to take any action against a group of Nationalist Congress Party workers who allegedly assaulted BJP spokesperson Vinayak Ambekar on Saturday over his “derogatory” social media comments about party supremo Sharad Pawar.

ITEMVIDEOS: బీజేపి నేతపై దాడి.. దిద్దుబాటు చర్యలకు దిగిన ఎన్సీపీ..

Posted: 05/16/2022 06:48 PM IST
Pune police register case against 4 ncp leaders for slapping bjp leader vinayak ambekar

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన బీజేపీ రాష్ట్రస్థాయి నేతపై దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. బీజేపి నేతపై దాడి చేయడంతో పాటు తమ అధినేత శరద్ పవార్ ను ఎవరైనా విమర్శిస్తే.. వారిపై దాడి చేయాలంటూ వివాదస్పద లేఖ జారీ చేసిన మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ యూత్ వింగ్ నేతను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను అగౌరవపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన పూణేకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌ కార్యాలయానికి వెళ్లిన కొందరు ఎన్సీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు.

శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా పోస్టు పెట్టడంపై ఆయనను వారు నిలదీశారు. ఆయన సమాధానం చెబుతుండగానే శరద్ పవార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంబేకర్‌ అందుకు నిరాకరించి.. తాను పెట్టిన పోస్టులో ఏదైనా తప్పు ఉన్నట్లు భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని స్పష్టం చేశారు. దీంతో ఓ కార్యకర్త ఆయన చెంప చెళ్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా ఈ దాడి చేసిన వీడియోను కూడా వారు చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై వినాయక్ అంబేకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

తనకు తన కార్యాలయంలోనే ఎన్సీపీ కార్యకర్తల కారణంగా జరిగిన పరాభవంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పన్ను సంప్రదింపుల కోసం తన కార్యాలయానికి వచ్చిన ఎన్సీపీ కార్యకర్తలు తనను దూషించడంతోపాటు దాడి చేసినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, బీజేపీ నేతపై దాడికి దారి తీసిన పరిణామాలపై ఎన్సీపీ ఆరా తీసింది. శరద్ పవార్‌ను విమర్శించే వారిని వదిలి పెట్టవద్దంటూ పశ్చిమ మహారాష్ట్ర ఎన్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలకు లేఖ పంపినట్లు తెలిసింది. దీంతో సోమవారం అతడ్ని పార్టీ నుంచి ఎన్సీపీ సస్పెండ్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles