CBI files fresh case against Mehul Choksi నకిలీ వజ్రాలతో టోపి వేసి రుణం పోందిన మెహుల్ చోక్సీపై మరో కేసు

Fresh case against choksi will not stand in court says his lawyer

Mehul Choksi, central bureau of investigation, CBI mehul choksi, Mehul Choksi fresh case, cbi fresh case against Mehul Choksi, fresh case of cheating on Mehul Choksi, Mehul Choksi duplicate diamonds case, gitanjali gems, cbi, antigua, Fake Diamonds, Cheating, Industrial Finance Corporation of India

The Central Bureau of Investigation (CBI) recently registered a fresh case against fugitive diamantaire Mehul Choksi and his company Gitanjali Gems for allegedly defrauding the Industrial Finance Corporation of India (IFCI) an FIR under IPC section 420 (cheating), 468 ( Forgery for purpose of cheating) and 471 (Whoever fraudulently or dishonestly uses as genuine) has been registered in Mumbai.

నకిలీ వజ్రాలతో టోపి వేసి రుణం పోందిన మెహుల్ చోక్సీపై మరో కేసు

Posted: 05/03/2022 09:24 PM IST
Fresh case against choksi will not stand in court says his lawyer

బ్యాంకుల నుంచి తీసుకున్న వేలాది కోట్ల రూపాయ‌ల రుణాన్ని ఎగ‌వేసి విదేశాల‌కు పారిపోయిన భారత ఆర్థిక ఉగ్రవాది గీతాంజ‌లి జెమ్స్‌ య‌జ‌మాని మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ మ‌రో కేసు న‌మోదు చేసింది. రుణాలు పోందడమే కాదు.. డబ్బు కోసం బ్యాంకులను వేల కోసం మేర మోసం చేసినట్టు కూడా తాజాగా వెల్లడైంది. ఇండ‌స్ట్రియ‌ల్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ)ని ఆయన కోట్ల రూపాయల మేర మోస‌గించిన‌ట్టుగా సీబీఐ అధికారులు తాజాగా మరో కేసును నమోదు చేశారు. చోక్సీతో పాటు ఆయ‌న కంపెనీ గీతాంజ‌లి జెమ్స్‌పైనా కేసు న‌మోదు చేశారు.

వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్‌ చోక్సీ ఐఎఫ్‌సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో మెహుల్‌ చోక్సీ, ఆయనకు చెందిన గీతాంజలి జెమ్స్‌, సూరజ్మల్‌ లల్లూభాయ్‌ అండ్‌ కో, నవేంద్ర జవేరి, ప్రదీప్‌ సి షా, శ్రేక్‌ షాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. నలుగురు వేర్వేరు అప్రైజర్లు ఆభరణాల విలువ రూ.34-45 కోట్లుగా ఇవ్వగా.. దీంతో ఐఎఫ్‌సీఐ చోక్సీకి రుణం ఇచ్చింది. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లు, ఆభరణాలను విక్రయించి రికవరీ చేసుకున్నందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తాకట్టుపెట్టిన 20,60,054 షేర్లలో 6,48,822 షేర్లను ఐఎఫ్‌సీఐ రూ.4.07కోట్లు రివకరీ చేసుకున్నది.

చోక్సీ తనఖా పెట్టిన బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాల విలువ వాల్యుయేషన్‌ కంటే దాదాపు 98శాతం తక్కువగా కేవలం రూ.70లక్షల నుంచి 2 కోట్ల వరకు మాత్రమే ఉన్నట్లు తేలింది. వజ్రాలు నాసిరకంగా ఉన్నాయని, ల్యాబ్‌లో తయారు చేసినట్లు గుర్తించగా, రత్నాలు సైతం అసలైనవి కావని తేలింది. ఈ కేసుపై చోక్సీ త‌ర‌ఫు న్యాయ‌వాది విజయ్ అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చోక్సీపై సీబీఐ న‌మోదు చేసిన కొత్త కేసు ఊసుపోని క‌బుర్లు చెప్పుకునేందుకు మాత్ర‌మే ప‌నికొస్తుంద‌ని, కోర్టులో మాత్రం నిల‌వ‌ద‌ని ఆయ‌న అన్నారు. త‌న క్ల‌యింట్‌ను కిడ్నాప్ చేసేందుకు అంటిగ్వాకు కూడా వెళ్లేందుకు య‌త్నించిన సీబీఐ... ముందుగా త‌మ‌లోని లోపాల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles