US Supreme Court may overturn abortion rights, leak suggests అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న మహిళలు.!

Sc voted to overturn roe v wade abortion law leaked draft opinion reportedly shows

us, 13 states passed trigger laws, half of the US states bans trigger laws, US supreme court designed to overturn Roe v. Wade judgement, Roe v Wade, US supreme court, Law (US), Abortion, Health, Women, US news, International news

Millions of women across the US could soon lose their legal right to abortion, according to a leaked Supreme Court document. The document, published by Politico, suggests the country's top court is poised to overturn the 1973 decision that legalised abortion nationwide. If the court strikes down the Roe v Wade ruling, individual states would be allowed to ban abortion if they wish.

ముసాయిదా అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న మహిళలు.!

Posted: 05/03/2022 09:20 PM IST
Sc voted to overturn roe v wade abortion law leaked draft opinion reportedly shows

అబార్షన్ పై కొత్తగా తీసుకురానున్న ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా మహిళలు గళమెత్తారు. అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా తీసుకురానున్న ముసాయిదా అబార్షన్ చట్టం తమ హక్కులను కాలరాసే విధింగా ఉందని అదేశ మహిళలు చేపడుతున్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు వాషింగ్టన్‌ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టారు. తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు. అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది.

రో వ‌ర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివ‌ర‌ణ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని, దాని ప‌రిణామాలు ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు జ‌స్టిస్ అలిటో అభిప్రాయ‌ప‌డ్డారు. న్యాయ‌మూర్తులు ఇస్తున్న తీర్పు స‌రిగా లేద‌ని లీకైన డాక్యుమెంట్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అబార్షన్ హక్కులపై తీర్పు లీకైన స‌మాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ ఇంతవరకు స్పందించ‌లేదు. దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాన్ని ఎన్నికైన ప్ర‌తినిధుల‌కు ఇవ్వాల‌న్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం కొంద‌రు సుప్రీంకోర్టు ముందు నిర‌స‌న చేప‌ట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roe v Wade  US supreme court  Law (US)  Abortion  Health  Women  US news  International news  

Other Articles