KTR raises questions over Pawan Hans disinvestment లక్షతో స్టార్ట్ చేసిన కంపెనీకి వేల కోట్ల సంస్థను ఎలా అప్పగిస్తారు.?: కేటీఆర్

Ktr congress raises questions over pawan hans disinvestment

Congress, KT Rama Rao, Pawan hans, Star9 Mobility Pvt Ltd, Telangana, Telangana Rashtra Samithi TRS, Gourav Vallabh, Congress spokesperson

Telangana IT Minister KT Rama Rao criticised the Union government led by the NDA regarding the sale of public sector undertaking, Pawan Hans. KTR tweeted, “The sale of Pawan Hans, a profitable PSU to a Pvt company that was formed just 6 months ago with an authorised capital of ₹1 lakh raises many questions & doubts! Pawan Hans was valued at ₹3,700 Crores in 2017! Then How come 49% of it was sold at ₹211 Cr? Any answers NPA Govt?”

లక్షతో స్టార్ట్ చేసిన కంపెనీకి వేల కోట్ల సంస్థను ఎలా అప్పగిస్తారు.?: కేటీఆర్

Posted: 05/04/2022 11:30 AM IST
Ktr congress raises questions over pawan hans disinvestment

ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయానికి సంబంధించి ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు (కెటిఆర్) విమర్శించారు. ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని  కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్‌ హాన్స్‌ కంపెనీని విక్రయించడం అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తోందని కేటీఆర్‌ అనుమానాలను వ్యక్తం చేశారు.

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “1 లక్ష రూపాయల అధీకృత మూలధనంతో కేవలం 6 నెలల క్రితం స్థాపించబడిన ఒక ప్రైవేట్ కంపెనీకి లాభదాయకమైన వేల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్‌ను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. 2017లో పవన్ హన్స్ విలువ రూ. 3,700 కోట్లు! అప్పుడు దానిలో 49% రూ. 211 కోట్లకు ఎలా అమ్మబడింది? కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. మరోవైపు హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడర్ పవన్ హన్స్ లిమిటెడ్ (పిహెచ్‌ఎల్)లో కేంద్రం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ఒప్పందంపై కాంగ్రెస్ ప్రశ్నలను లేవనెత్తింది,

దీనిని కేవలం కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించే బదులు సంస్థను ఒఎన్‌జిసిలో విలీనం చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. పవన్ హన్స్ లిమిటెడ్ (పిహెచ్‌ఎల్)లో ప్రభుత్వ 51 శాతం వాటాను, నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటుగా స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 211.14 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన విషయమై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మడిపడింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ, తమ ఆర్థిక విధానాలను సమర్థించుకునేందుకు తప్పుడు లెక్కలు చూపి, అనాలోచిత పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాల పరంపర కొనసాగిస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు.

ఈ 51 శాతం మెజారిటీ వాటా విక్రయానికి రిజర్వ్ ధర రూ. 199.92 కోట్లుగా నిర్ణయించడం.. రిజర్వు ధర కన్నా తక్కువగా ఇద్దరు బిల్డర్లు కోట్ చేయడం.. ఒక్కరు మాత్రమే రిజర్వు ధరకి పైన బిడ్లు వేయడం కూడా సందేహాలకు తావిస్తోందని వల్లబ్ అరోపించారు.ఇది సాధారణ పెట్టుబడుల ఉపసంహరణ మాదిరిగా అనిపించినప్పటికీ, స్టార్ 9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఓ చిన్న కంపెనీ అని.. ఇక దీనికి ఇప్పటివరకు సోంతంగా ఒక్క విమానం కూడా లేదని వల్లబ్ తెల్చిచెప్పారు. ఇక దాని కన్సార్టియం కంపెనీలు బిగ్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అల్మాస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ ఎస్పీసీ అనేక అంశాలు విస్మాయనికి గురిచేస్తున్నాయని వల్లభ్ చెప్పారు.

స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు తన ఫ్లీట్‌లో కేవలం 3 హెలికాప్టర్లను మాత్రమే కలిగి ఉందని, ఇక అల్మాస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ ఎస్పీసీ కేమన్ దీవుల అధికార పరిధిలో ఏర్పాటు చేయబడిందని దానికి ఈ రంగంలో ఎటువంటి సంబంధం లేదా అనుభవం లేదని ఆయన చెప్పారు. మరో కన్సార్టియం కంపెనీ ఢిల్లీ హైకోర్టులో బిగ్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈజెన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన కసు కోర్టులో నడుస్తోందని వల్లభ్ పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో పాల్గొనేందుకు పవన్ హన్స్ ఉద్యోగుల సంఘం ఆసక్తిని కనబరిచింది అయినా వారిని పక్కనబెట్టి.. ఈ ఆర్నెళ్ల కంపెనీకి కట్టబెట్టడం అనుమానాస్పదంగా ఉందని వల్లబ్ ఎత్తి చూపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles