హైదరాబాద్ మినీ భారత్ గా కూడా ఖ్యాతి గడించింది. ఇక అంతర్జాతీయ నగరంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోట్ చేస్తున్న క్రమంలో.. నిజంగానే అంతర్జాతీయ నేర కార్యకలాపాలకు కూడా ఇది అడ్డాగా మారింది. అసాంఘికశక్తులు హైదరాబాద్ కేంద్రంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. అందివచ్చిన నూతన సాంకేతికతను వారు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తూ.. పోలీసులకు చిక్కకుండా.. అడ్డు అదుపులేకుండా నిరాటంకంగా తమ దందాలను కోనసాగిస్తున్నారు.
సాంకేతికతో పాటు సరికొత్త విధానాలను అవలంభిస్తూ అంతర్జాతీయ ముఠాలు తమ అక్రమాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా దేశంకాని దేశంలో వీసాలపై వచ్చిన పరాయిదేశ యువతులు కూడా అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నాయి. హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యభిచార దందాను ఉగాండా దేశీయులు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సెక్స్ రాకెట్ కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. స్పెషల్ కోడ్ తో బుకింగ్స్ చేపడుతన్నట్లు తేల్చారు. ఇందులో ఉగాండా దేశీయులతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యభిచార దందా బయటికి రాకుండా నిర్వాహకులు పెద్ద వ్యవస్థనే రూపొందించారు. బ్యాంక్ యాప్లో సెక్యూరిటీ మాదిరిగా ఓ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. దీని ఆధారంగా ప్రత్యేక కోడ్ లు పంపిస్తారు. ఈ కోడ్ లను ఫ్లాట్ కు వచ్చినప్పుడు ఎంట్రీ చేస్తేనే విటులను కలిసే అవకాశం ఉండేలా తయారు చేశారు. గతంలో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్లతో పోల్చితే.. ఇది కొత్త తరహా దందాగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈస్థాయిలో హైటెక్ సెక్స్ బయటికి రావటం నగర పోలీసులకు సవాల్ గా మారింది.
మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more