Nizamabad: one killed, 3 injured in EV battery explode మరో ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలింది.. ఒకరు మృతి..

80 year old killed in electric vehicle battery explosion in nizamabad of telangana

Electric scooter, EV Battery explosion, Nizamabad e-scooter explosion, Ramaswamy, Prakash, Nizamabad III Town police station, Telangana, Crime

An 80-year-old man died as the battery of an electric scooter exploded in their house in Telangana's Nizamabad on Wednesday night. The man's wife and grandson also suffered severe burn injuries due to the explosion. The deceased has been identified as B Ramaswamy.

మరో ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలింది.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..

Posted: 04/21/2022 04:59 PM IST
80 year old killed in electric vehicle battery explosion in nizamabad of telangana

ఓ వైపు ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో ఇంటిల్లిపాదికి పూజ బోజనం పెట్టాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కోనాల్సిందేనని తొందరపడి కొన్నా ఓ వ్యక్తి తన కన్నతండ్రినే పోగొట్టుకున్నాడు. అంతేకాదు తన తల్లి, తన కుమారుడి ప్రాణల మీదకు తీసుకువచ్చాడు. ఇటీవల జీడిమెట్లలో ఓ ఈవీ బైక్ బ్యాటరీ పేలి.. మంటలు వ్యాపించిన ఘటన మర్చిపోకముందే అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడులో ఓ తండ్రి కూతుళ్ల ప్రాణాలను కూడా ఈవీ స్కూటర్ బ్యాటరీ హరించిన ఘటన వెలుగుచూసింది.

ఇలా ఎలక్ట్రికల్ స్కూటర్ ను కొంటే.. బాంబును కొనుక్కోని ఇంట్లో పెట్టుకున్నట్లేనంటూ నెటింట్లో మీమ్స్ కూడా వివరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవీ స్కూటర్ల బ్యాటరీలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రజల పాలిట ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా ఠక్కున పెలిపోతున్న బ్యాటరీలతో వాటిని కొన్నవారికి ఏక్షణాన ఏం జరుగుతుందోనన్ని అందోళన మాత్రం కలగకతప్పడం లేదు. తాజాగా ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి నిజామాబాద్ జిల్లాలో ఒక వృద్దుడు మరణించాడు. కాగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టి పడుకున్నారు. ఆ తర్వాత అది పేలిపోయింది. ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏదోఒక చోట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవింగ్‌ సమయంలో మంటలు రావడం.. ఛార్జింగ్‌ పెట్టినప్పుడు పేలిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే తమిళనాడులోని వేలూరులో ఛార్జింగ్‌ అవుతున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి తండ్రికూతురు మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే నిజామాబాద్‌లో మరొకటి చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles