తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రైతుల వద్ద ముఖం చెల్లక.. దేశరాజధాని న్యూఢిల్లీలో ధర్నా పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాసంగి గింజలపై ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసిచ్చే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. బాయిల్డ్ రైస్ ను రాష్ట్రం సరఫరా చేయదని కేంద్రానికి హామీ ఇచ్చిందీ ఆయనే.. ఇప్పుడు ధర్నాల పేరుతో డ్రామాలు అడుతోంది ఆయనేనని రేవంత్ అరోపించారు.
ధర్నాలు, నిరసనలు అంటూ ఇక్కడ ముఖం చెల్లక హస్తినకు వెళ్లి నాటకాలు ఆడితే రైతులు విశ్వసిస్తారని భావిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్రాల్లోని రెండు బీజేపి, టీఆర్ఎస్ పార్టీల మోసాలను రైతులు ముందునుంచే గ్రహించారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన లేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు. ఓ వైపు రైతుల జీవితాలను బలిపీఠంపై పెట్టిన మీరే మరోవైపు ధర్నాలతో డ్రామాలకు తెరలేపుతారా? అని ప్రశ్నించారు.
వరి సేకరణ వల్ల రాష్ట్రానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇకపై ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారా లేదా.? అని ఆయన ప్రశ్నించారు. బియ్యం కొనుగోలు చేయవద్దన ఆలోచన అప్పుడే పురుడు పోసుకుందన్న సందేహాన్ని రేవంత్ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25, మార్చి 8న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)తో జరిగిన క్యారచరణ ప్రణాళిక వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఈ సారి ధాన్యం సరఫరా చేయడం లేదని కేంద్రానికి తెలియజేశారా లేదా.? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మార్చిలో వరి సేకరణకు ఏర్పాట్లు ప్రారంభించాలి. ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్‌గా ఉండి ఉంటే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైస్‌మిల్లర్లకు కోటా కేటాయింపు, రవాణా టెండర్ల ఖరారు ప్రక్రియ ఎందుకు పూర్తి చేయలేదు? వరి రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారనేది నిజం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ (డిపిఎస్)లో భాగమని, కొనుగోలు కేంద్రాలను తెరవడం రాష్ట్ర బాధ్యత అని తెలియజేసిన టిపిసిసి అధ్యక్షుడు, రాష్ట్రంలో పాలన బాధ్యతను నెరవేర్చకుండా న్యూఢిల్లీలో ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దళారుల చేతుల్లో రైతులు రూ. 3,000 కోట్లు నష్టపోయేలా కాకుండా రూ. 1,500 కోట్ల నష్టాన్ని భరించడం ద్వారా రాష్ట్ర సేకరణ సమస్యను పరిష్కరించవచ్చని రేవంత్ రెడ్డి కోరారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more