Nampally Court to hear pub drugs case on April 11 బంజారాహిల్స్ పోలీసు కస్టడీకి పుడ్డింగ్ పబ్ కేసు నిందితులు..

Hyderabad police to issue notices to 20 members involved in drugs case in mint pub

Pudding and Mink pub, Radisson Blu Plaza Hotel, 6 grams of cocaine, Kallapu Kushita, Junior artist Kallapu Kushita, Rahul Sipligunj, rahul sipligunj in drugs case, Tollywood Drugs Case, Movie News, Radisson Blu Plaza Hotel. Drugs, Banjara Hills, tollywood drugs case, Hyderabad Police, Telangana, Crime

The Banjara Hills police on Friday submitted a petition in the Nampally Court seeking 7-day custody of Pudding and Mink pub owner and manager Abhishek and Anil. On the other hand, a bail petition was submitted to the Court seeking bail for the duo. The Court postponed the hearing to April 11.

బంజారాహిల్స్ పోలీసు కస్టడీకి పుడ్డింగ్ పబ్ కేసు నిందితులు..

Posted: 04/11/2022 08:18 PM IST
Hyderabad police to issue notices to 20 members involved in drugs case in mint pub

నషాముక్త్ హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్న పోలీసులు బంజారాహిల్స్ ర్యాడిసన్ హోటల్ పై దాడి చేయగా, అందులో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీలు, వారి సంతానం ఉండటంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే ఈ పబ్ పై ఇతర పబ్ కు చెందిన సభ్యుల నుంచి పిర్యాదులు వెలువడిన నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారన్న వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారన్న విషయం కూడా తెలిసిందే.

ఈ వ్యవహారంలో మాదకద్రవ్యాలు తీసుకున్న వారిని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. పబ్ లోని సీసిటీవీ  ఫూటేజీతో పాటు నిర్వాహకుల నుంచి విచారణలో రాబట్టిన సమాచారంతో మొత్తంగా ఆ రోజు రాత్రి ఫుడ్డింగ్ అండ్ మింట్ ఫబ్ లో ఏకంగా 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఇక త్వరలోనే వీరికి తాఖీదులు కూడా పంపనున్నారు. పబ్ మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ గోవా ముంబై కి చెందిన కొంతమంది వ్యక్తులతో లింకులు వున్నాయని పోలీసులు సమాచారం రాబట్టారు. వీరిలో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్ కూడా ఉన్నారని తెలుసుకున్న పోలీసలు వారిని విచారించేందుకు కోర్టులో పిటీషన్ వేశారు.  

ఈ పిటీషన్ పై ఇవాళ విచారించిన నాంపల్లి కోర్టు.. ఫుడింగ్‌ పబ్‌ కేసులో నిందితులను పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టు అనుమతి నేపథ్యంలో అనిల్‌ ఇద్దరిని బంజారాహిల్స్‌ పోలీసులు ప్రశ్నించనున్నారు. అదే రోజున వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చాగా.. వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ను విధించింది. బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ పిటీషన్ పై ఇవాళ విచారించిన కోర్టులో నాలుగు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles