BJP doesn't hold Hindutva patent, says Uddhav Thackeray ‘‘రాముడే పుట్టకపోతే.. బీజేపి నినాదమేంటో’’: ఉద్దవ్

Had ram not been born what would bjp have raised uddhav thackeray

Uddhav Thackeray, BJP, Hindutva, Maharashtra CM, Shiv Sena chief Bal Thackeray, saffron and Hindutva, Jayashree Jadhav, Congress, Maha Vikas Aghadi's (MVA) candidate, Kolhapur North seat, Maharashtra, Politics

Maharashtra Chief Minister and Shiv Sena president Uddhav Thackeray said the BJP doesn't hold "patent" on Hindutva and claimed that the late Sena chief Bal Thackeray had showed BJP that the combination of "saffron and Hindutva" will help in achieving power in Centre.

‘‘రాముడే పుట్టికపోయివుంటే.. బీజేపి నినాదం ఏమైఉండేదో..’’: ఉద్దవ్

Posted: 04/11/2022 10:02 PM IST
Had ram not been born what would bjp have raised uddhav thackeray

కేంద్రంలోని అధికార బీజేపీతో దోస్తీకి దూరమైన మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన వ్యంగాస్త్రాలు సంధించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపిని లక్ష్యంగా చేసుకుని మరోసారి ధ్వజమెత్తారు. హిందుత్వంపై తనకే సర్వహక్కులు ఉన్నట్టు బీజేపీ భావిస్తోందని, అది సహేతుకం కాదని.. ఇతర రాజకీయ పార్టీలలో హిందువులు ఉండరాదన్న తీరుగా బీజేపి వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. హిందుత్వం, కాషాయం కలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని బీజేపీకి మార్గదర్శనం చేసింది దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.

కాషాయం-హిందుత్వం కలయికపై శివసేన ఎప్పటికీ నిబద్ధతతో ఉంటుందని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ మాత్రం భారతీయ జనసంఘ్, జనసంఘ్ అంటూ రకరకాల పేర్లతో భిన్నమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తోందని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ప్రజల మధ్య శాంతి, సౌబ్రాబృత్వం నెలకొల్పుతూ.. సామరస్యతను చాటుతూనే అధికారంలోకి రావాలన్న సిద్దాంతాలకు తూట్లు పోడుస్తున్న బీజేపి.. కేవలం అధికారమే పరమావధిగా భావించి.. మతాల మధ్య వైషమ్యాలను పెంచుతూ హింసను రెచ్చగోడుతూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు.

కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగనుండగా, మహావికాస్ అఘాడీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ పోటీ చేస్తున్నారు. దీంతో అమె తరఫున సీఎం ఉద్ధవ్ థాకరే వర్చువల్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. "హిందుత్వంపై తమకే అధికారం ఉంటుందని, దానిపై పేటెంట్ తమదే అన్నట్టుగా బీజేపీ భావిస్తుంటుంది. అది సరికాదు. నాకు ఒక విషయంలో ఆశ్చర్యం వేస్తుంది... ఒకవేళ రాముడే పుట్టకపోయి ఉంటే ఈ బీజేపీ వాళ్లు రాజకీయాల్లో ఏ నినాదం తలకెత్తుకునేవారో అనిపిస్తుంటుంది" అని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles