74-Year-Old English Lecturer Who Became An Auto- Driver కులంపై విరక్తి చెందిన లెక్చరర్ ఏం చేస్తున్నాడో తెలుసా.?

Story of a 74 year old english lecturer who became an auto rickshaw driver is absolutely amazing

Pataabi Raman, auto-rickshaw driver, Nikita Iyer, english lecturer, reputed Powai college, Kadugodi, casteism in karnataka, bengaluru, Karnataka

When you're travelling in an auto-rickshaw in India, you don't usually hear your driver speaking in English. But a passenger from Bengaluru named Nikita Iyer did and she was amazed. Nikita was getting late to reach her office which was on the other end of the town. This is when the 74-year-old elderly auto-rickshaw driver Pataabi Raman stopped to help her. He told her, "Please come in Maa'm, you can pay what you want."

‘‘నీ కులమేంటీ..’’ ఈ ప్రశ్నతో విరక్తి చెందిన లెక్చరర్ ఏం చేస్తున్నాడో తెలుసా.?

Posted: 03/30/2022 04:15 PM IST
Story of a 74 year old english lecturer who became an auto rickshaw driver is absolutely amazing

ఆటో డ్రైవర్ గా వున్న వ్యక్తిని హీరోగా చేసిన కన్నడ రాష్ట్రం.. అదే హీరోను పాన్ ఇండియా హీరోగా నిలబెడుతోంది. కానీ ఆంగ్లంలో నిష్ణాతుడైన ఓ పండితుడికి మాత్రం ఉపాధిని కల్పించలేకపోయింది. దీంతో ఆయన ఆంగ్లాన్ని నమ్ముకోవడం కన్నా ఆటోను తోలుకోవడం సులభమని తన బతుకుబండిని నడుపుతున్నారు. ఔనా.. ఇది నిజమేనా.? అంటే ముమ్మాటికీ నిజం. అయితే అందుకు ఓ కారణం వుంది. అదేంటో తెలియాలంటే ఆయన కథలోకి వెళ్లాలి. అయితే ఆయన ఆటోలో ప్రయాణించి.. ఆయనతో దాదాపుగా 45 నిమిషాల పాటు మాట్లాడిన నిఖిత అయ్యార్ అనే ప్యాసెంజర్ తన ఇస్టాలో పోస్టు చేసిన కథలో ఆయన వివరాలు ఉన్నాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆయన ఆంగ్ల పండితుడి పేరు పట్టాభి రామన్. ఆయన వయస్సు ఏకంగా 74 ఏళ్లు, అనర్గళంగా ఆయన ఆంగ్లం మాట్లడగలదు. బెంగుళూరులోని మరోవైపున ఉన్న తన కార్యాలయానికి అమె వెళ్లాలి. అయితే అమెకు కాస్తా ఆలస్యమైందని కంగారుపడుతోంది. దీంతో అప్పుడే వెనుకగా వచ్చిన ఓ ఆటో.. నా ఆటోలో రండీ మేడం.. మీకు తోచ్చింది ఇవచ్చు కానీ.. అంటూ ఆంగ్లంలో చెప్పారు. అందుకు అమెసమ్మతించి అటో ఎక్కడంతో పాటు మీరు ఇంత ఫ్లూయంట్ ఇంగ్లాషు మాట్లాడుతున్నారు. అంటూ మాటలు కలిపింది ప్యాసెంజర్ నిఖిత అయ్యార్.

పట్టాబిరామన్ తో మాట్లాడిన తరువాత ఆయన గురించి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ స్టోరిని రాసింది నిఖితా అయ్యార్. పట్టాభిరామన్ మాట తీరు చూసిన నిఖిత అయ్యర్ అనే మహిళా ఉద్యోగి ఆ వివరాలను లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. ఆసక్తికరమైన ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు. రిటైర్ అయ్యాక ఏ జాబ్ దొరకలేదని, దీంతో 14 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నానని పట్టాభి రామన్ చెప్పారు. కర్ణాటకలో ఉద్యోగ అవకాశాల్లేక ముంబైకి వెళ్లి పోవాయిలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేరానన్నారు. ఎంఏ ఎంఈడీ చేసిన తాను అప్పట్లో బెంగళూరులో ఎక్కడ ఇంటర్వ్యూకు వెళ్లినా ‘నీ కులం ఏంటి?’ అన్న ప్రశ్నే ఎదురైందని, తన పూర్తి పేరు చెప్పగానే అర్థమై ‘తర్వాత చెప్తాం’ అని చెప్పి పంపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

దీంతో ముంబైకి వెళ్లి 20 ఏళ్ల పాటు ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేశానని పేర్కొన్నారు. రిటైర్ అయ్యాక బెంగళూరు వచ్చేశానని తెలిపారు. టీచింగ్ చేసేటప్పుడు నెలకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చేవారని, కానీ, ఇప్పుడు ఆటో నడుపుతూ రోజుకు రూ.700 నుంచి రూ.1,500 సంపాదిస్తున్నానని పెద్దాయన చెప్పారు. తన భార్యే తనకు గర్ల్ ఫ్రెండ్ అని, భార్యలనూ సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. భర్తకన్నా భార్య ఎప్పుడూ తక్కువ కాదని అన్నారు. కొన్ని కొన్ని సార్లు తనకన్నా తన భార్యే ఎక్కువని అన్నారు. తమకు పిల్లలున్నా వారికి భారం కారాదన్న ఉద్దేశంతోనే తాను ఆటో నడుపుతున్నానని పట్టాభిరామన్ తెలిపారు. ఎవరి జీవితం వాళ్లం గడుపుతున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles