"BJP Trying To Kill Arvind Kejriwal", Says AAP ‘‘కేజ్రీవాల్‌ను హ‌త్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర’’

Tejaswi surya led protest reaches kejriwal door aap says attempt on his life

Arvind Kejriwal residence vandalised, Arvind Kejriwal news, Central Intelligence, Delhi Police, IB failure, Civil lines, National Capital, CM Aravind Kejriwal, The Kashmir Files, BJP, BJYM, Manish Sisodia, Manish Sisodia news, Delhi news, latest delhi news, Crime

In a day of high drama, members of the BJYM managed to reach the entrance to Chief Minister Arvind Kejriwal’s Civil Lines residence and banged on the main door, in what the Aam Aadmi Party said was an attempt on his life. BJYM national president and Lok Sabha MP Tejaswi Surya led the protesters, many of whom were captured on CCTV breaking the boom barrier and kicking and banging the main gate before painting it red.

సీఎం ఇంటిపై దాడి.. బారికేడ్లు, సీసీ కెమెరాలు ధ్వంసం..! హత్య చేసే కుట్ర.!!

Posted: 03/30/2022 05:08 PM IST
Tejaswi surya led protest reaches kejriwal door aap says attempt on his life

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపి కార్యకర్తలు దాడికి దిగారు. దేశంలోని ప్రజల నడవడిక ఎలా వుండాలో.. ఎలా ఉండకూడదో.. అంటూ హీతోక్తులు చెప్పే పార్టీకి చెందిన కార్యకర్తలు.. గీత దాటి ఏకంగా ముఖ్యమంత్రి నివాసంపైనే దాడికి దిగారు. ఆయన ఇంటిపై ఏకకాలంలో ఒక మూక దాడి చేసి.. సిసి కెమెరాలను ధ్వంసం చేసింది. ఇంటి బయట ఉన్న బారికేడ్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు భీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ సివిల్ లైన్స్​లోని సీఎం ఇంటి బయట బారికేడ్లను తొలగించి ఆందోళనలు చేపట్టారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై బీజేపి కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారన్న సమాచారం కూడా రాబట్టుకోలేని ఇంటెలిజెన్స్ ఢిపార్టుమెంటు ఏం చేస్తోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి,. మరోమారు ఇంటెలిజెన్స్ శాఖ పూర్తిగా విఫలయమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచాల్సిన పోలీసులు కూడా చేష్టలుడికి చూడటం వెనుక ఆప్ పార్టీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అర‌వింద్ కేజ్రీవాల్‌ను హ‌త్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర ప‌న్నింద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మ‌నీష్ సిసోడియా ఆరోపించారు. ఎంపీ తేజ‌స్వి సూర్య నేతృత్వంలో కాషాయ పార్టీ కార్య‌క‌ర్త‌లు అర‌వింద్ కేజ్రీవాల్ నివాసం వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న చేపట్టారు. క‌శ్మీర్ ఫైల్స్ మూవీలో చూపిన క‌శ్మీర్ పండిట్ల ఊచ‌కోత అవాస్త‌వ‌మ‌ని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిర‌స‌నకు దిగిన ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు కిటికీ అద్దాల‌ను ధ్వంసం చేశారు. ఢిల్లీ పోలీసుల స‌మ‌క్షంలోనే ఇవాళ బీజేపీ గూండాలు సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని హింస‌కు పాల్ప‌డ్డాయ‌ని సిసోడియా పేర్కొన్నారు.

కాషాయ గూండాలు సెక్యూరిటీ బారికేడ్ల‌ను ప‌గుల‌గొట్టార‌ని, సీసీటీవీల‌ను ధ్వంసం చేశార‌ని పోలీసుల కండ్ల ముందే ఇవ‌న్నీ జ‌రిగాయ‌ని అన్నారు. కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు ముందస్తు ప్ర‌ణాళిక‌తోనే దాడులు జ‌రిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను అంత‌మొందించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆప్ నేత సౌర‌వ్ భ‌ర‌ద్వాజ్ ఆరోపించారు. గ‌తంలోనూ కేజ్రీవాల్‌పై కాషాయ పార్టీ దాడుల‌కు తెగ‌బ‌డింద‌ని గుర్తుచేశారు. ఏదో సాకుతో కేజ్రీవాల్‌ను హ‌త్య చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు. పంజాబ్‌లో ఆప్ విజ‌యంతో బెంబేలెత్తిన కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీ పోలీసుల‌తో కుమ్మ‌క్కై ముఖ్య‌మంత్రిపై దాడుల‌కు కుట్ర‌ప‌న్నుతోంద‌ని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles