Traffic police impose fine to Manchu Manoj మంచు మనోజ్ కారుకు అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు.

Hyderabad traffic police impose fine to manchu manoj and removes black film

Hyderabad traffic police, Manchu Manoj, Tolichowki, black film, traffic rules violators, special drives, imposing fines, Supreme Court Orders, police removes black film from manchu manoj car, Allu Arjun, Kalyan Ram, Hyderabad, Telangana

Hyderabad traffic police conducting special drives across the city and imposing fines for the traffic rules violators. According to the reports, traffic police stopped actor Manchu Manoj at Tolichowki and removed the black film from the tinted glasses on his car and imposed Rs 700 fine.

మంచు మనోజ్ కారుకు అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు. ఛలాన్ విధింపు

Posted: 03/30/2022 01:34 PM IST
Hyderabad traffic police impose fine to manchu manoj and removes black film

రోడ్డు ప్ర‌మాదాలు ఈ మధ్యకాలంలో మళ్లీ అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలకు ఉపక్రమించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు మూలకారణాలపై దృష్టిసారించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్ానరు. కొందరు వాహనాలపై ఫేక్ స్టిక్కర్లు వేసుకొని రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నారు.. వీరికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. కార్లకు నకిలీ స్టిక్కర్లు, ఎమ్మెల్యే స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములతో తిరుగుతున్న వారిని గుర్తించి వారికి చలానాలు విధిస్తున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌ కూడలి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, షేక్ పేట్ కూడలి, టోలిచౌకీ, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల సినీ నటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్‌ల కార్లను జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించి  రూ. 700 చొప్పున చలాన్లు విధించినట్లు తెలిపారు.. ఇక బ్లాక్ ఫిల్ముతో పాటు ఇతర నిబంధనలు పాటించని 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.. వారం కింద కూడా తనిఖీల్లో భాగంగా సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మ్‌ ఉండటంతో వాహనాన్ని ఆపి దాన్ని తొలగించి ఫైన్ వేశారు..

తాజాగా సినీ హీరో మంచు మనోజ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. మెహిదీపట్నంలో వాహనాల తనిఖీ నిర్వహించిన టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు అటుగా వెళ్తున్న మంచు మనోజ్ ఏపీ 39HY 0319 కారును ఆపారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి 700 రూపాయల చలాన్ విధించారు. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా కారులోనే ఉండగా పోలీసుల విధి నిర్వహణకు సహకరించారని పోలీసులు తెలిపారు. కాగా, వై- క్యాటగిరి, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ వంటి భద్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్లాక్ స్క్రీన్ ఉపయోగించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles