Chandrababu denies allegations on Pegasus spyware మమతా బెనర్జీ అరోపణలకు ఖండించిన చంద్రబాబు

Chandrababu naidu denies allegations on pegasus spyware chandrababu naidu news

Chandrababu Naidu, TDP, Pegasus spyware, Mamata Banerjee, Chandrababu Naidu statement, Chandrababu Naidu news, Chandrababu Naidu allegations, Chandrababu Naidu about Pegasus spyware, Chandrababu Naidu on Pegasus, Chandrababu Naidu Mamata Banerjee, Pegasus spyware news, Pegasus spyware updates, Pegasus spyware latest, Pegasus spyware breaking news, Pegasus spyware breaking updates, BJP, YSRCP, Prashant Kishore, PM Narendra Modi, National Politics

Chandrababu Naidu denies allegations on Pegasus spyware: West Bengal Chief Minister Mamata Banerjee made strong allegations on TDP Chief and ex-Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu that he bought Pegasus spyware to keep a tap on the calls. The TDP Chief responded saying that they have never purchased any spyware.

పెగసెస్ స్పైవేర్ పై మమతా అరోపణలకు ఖండించిన చంద్రబాబు

Posted: 03/19/2022 05:48 PM IST
Chandrababu naidu denies allegations on pegasus spyware chandrababu naidu news

పార్లమెంట్ సమావేశాలను కూడా గతేడాది స్థంభింపజేసిన పెగసెస్ స్పైవేర్ అంశం ఇప్పుడు రాజకీయాల్లో మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్ కాల్స్‌పై నిఘా ఉంచేందుకు పెగాసస్ స్పైవేర్‌ను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు సంధించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. తాము ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్ కొనుగోలు చేయలేదని.. మమతాబెనర్జీ చేసిన అరోపణలను తీవ్రంగా ఖండించారు.

పెగాసస్‌ ఆఫర్ ను మా ప్రభుత్వం తిరస్కరించిందని ఇప్పటికి స్పష్టంగా తెలిసిపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేసుకున్న కర్నూలు వాసి కాపీలను ఆయన చూపించారు. ఈ ప్రచారం ద్వారా తనను, టీడీపీని అప్రతిష్టపాలు చేసేందుకేనని అరోపించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోందని చంద్రబాబు పేర్కోన్నారు. తమపై తమ పార్టీపై కావాలనే అరోపణలు సంధిస్తున్నారని.. నిరాధార అరోపణలు చేయడం సహేతుకం కాదని ఆయన సూచించారు.

కర్నూలు జిల్లా యెమ్మిగనూరుకు చెందిన కోనేరు నాగేంద్ర ప్రసాద్, పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందో లేదో తెలుసుకోవడానికి 2021 జూలై 25న RTIకి దరఖాస్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించిన సాఫ్ట్‌వేర్ ఏదీ లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. "మేం ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదు. ఎలాంటి అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదు. ఆమె నిజంగా అలా మాట్లాడిందో, ఎక్కడ, ఏ సందర్భంలో చెప్పిందో నాకు తెలియదు. ఒకవేళ ఆమె అలా చెబితే, ఆమెకు తప్పు సమాచారం ఉంది" అని అన్నారు. .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు పెగాసస్ స్పైవేర్‌ను ఆఫర్ చేశారని, ప్రజల గోప్యతను పరిగణనలోకి తీసుకుని తాను ఆ ప్రతిపాదనలను వ్యతిరేకించానని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ స్పైవేర్ ఉందని ఆమె పేర్కొన్నడంతో అది కాస్తా సంచలనంగా మారింది. దీంతో టీడీపీపై విమర్శల వర్షం కురిసింది. అయితే అది సత్యదూరమని.. ఏపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను ఎప్పుడూ కొనుగోలు చేయలేదని ఆర్టీఐ ఆధారాలను టీడీపీ నేతలు షేర్ చేశారు. అలాంటి స్పైవేర్‌లు ఉంటే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను టీడీపీ అడ్డుకునేదని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles