Idli or mysore bajji served hot at ruppee one in AP తూర్పుగోదావరిలో రూపాయికే ఇడ్లీ.. 16 ఏళ్లుగా అదే ధర..!

Idli or mysore bajji served hot at ruppee one in east godavari of andhra pradesh

yummy idly, taste idly one one rupee, one rupee one idly, Rs 1 Idly, Rs 1 mysore Bajji, street food, Chinni Ramakrishna, Rambabu, East godavari, cheep hotel in andhra pradesh, low price tiffen, road side food, RB kothur, Peddapuram, East Godavari, Andhra pradesh

What can you get at the cost of Rs 1 now a days.. every one keep guessing as there are only few which we get, but amid the price raise this hotel is serving hot idli and mysore bajji at the cost of Rs.1 each in Peddapuram mandal in East Godavari of Andhra Pradesh.

తూర్పుగోదావరిలో రూపాయికే ఇడ్లీ.. 16 ఏళ్లుగా అదే ధర..! ఎక్కడో తెలుసా.?

Posted: 03/19/2022 07:12 PM IST
Idli or mysore bajji served hot at ruppee one in east godavari of andhra pradesh

ఈ రోజుల్లో రూపాయిని యాచకులకు దానం చేసినా.. వారు తిరిగి ఇచ్చేస్తున్నారు. కొందరైతే రూపాయిని ఎగదిగా చూసి.. రూపాయికి ఏం వస్తుంది బాబు అని అడిగేస్తున్నారు. నిజమే ఎం వస్తుందని అలోచిస్తే.. ఠక్కున గుర్తుకువచ్చేదీ ఒక్కటీ తొచదు. కానీ అదే రూపాయికి ఇడ్డీ, మైసూర్ బజ్జీలను అందిస్తున్న హోటల్ మన అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందంటే మీకు నమ్ముతారా.? ఔనా కొత్తగా పెట్టారేమో.. పబ్లిసిటీ కోసం కొన్ని రోజులు ఇలానే ఆఫర్ ఇస్తారు. అలవాటు పడిన తరువాత.. రేటను అమాంతం పెంచేస్తారు. ఈ బిజినెస్ టెక్నిక్స్ అన్ని అందరికీ తెలుసులేండీ.? అంటారా.?

అయితే మీరు పోరబడినట్టే. ఎందుకంటే ఈ ఇక్కడ ఇడ్లీ మాత్రమే కాదు.. ఒక్క రూపాయికి మైసూర్ బజ్జీ కూడా వస్తుంది. అంతేకాదు.. వాటిని రుచికరంగా అరగించేందుకు మూడు రకాల చెట్నీలు కూడా ఇస్తారు..? ఔనా అని అలోచనలో పడ్డారా.?. నిత్యావసరాల సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఏడాది, రెండేళ్లు లోపు రెట్టింపు అవుతున్నాయి. ఏదీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి రోజుల్లో చిన్న వ్యాపారులు సైతం రేట్లను రెట్టింపు చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న రేట్లను కరోనా తరువాత భారీగా పెంచారు. కానీ ఆ హోటల్ యజమాని 16 ఏళ్ల నుంచి ఒకే రేటుకు ఫలహారం అందిస్తున్నారు.

రూపాయికే ఇడ్లీ అమ్మే ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా..? తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం-కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్‌ నుంచి 3 కిలో మీటర్ల దూరం వెళితే ఆర్‌బీ కొత్తూరు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఉంది ఈ అతి చౌకైన హోటల్.. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ అలియాస్ రాంబాబు, రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్‌ నిర్వహిస్తున్నారు.  ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు.  

కానీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్‌లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్‌ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్‌ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్‌ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్‌కు వస్తారని తెలిపాడు.

రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను అన్నారు. అయితే ఈ విషయంలో తనను చాలా మంది ఇబ్బంది పెట్టారని.. ధర పెంచాలన్నారు. కానీ తనకు నచ్చలేదన్నారు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టాను అన్నారు. తన భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను అన్నారు. కేవలం నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది తనకు చాలా సంతృప్తి కలిగిస్తుంది అంటున్నారు హోటల్ యాజమాని..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles