Dancing Man Stabs Himself During Stunt At Holi Celebrations హోలి పండగ రోజున విషాదం.. కత్తితో విన్యాసం చేయబోయి..

On camera dancing man stabs himself during stunt at holi celebrations

Gopal Solanki, heavily drunk, Holi, Holi Pyre, stabbed himself, knife, stunt, Indore, Indore accident, Holika Dehen, Madhya Pradesh, viral video, crime

A 38-year-old man accidentally stabbed himself while enacting a stunt during Holi celebrations in the Banganga area of Madhya Pradesh's Indore. Police said Gopal Solanki, who was dancing with his friends and had a knife in his hands, accidentally stabbed himself when he tried to enact a stunt

ITEMVIDEOS: హోలి పండగ రోజున విషాదం.. కత్తితో విన్యాసం చేయబోయి..

Posted: 03/19/2022 04:57 PM IST
On camera dancing man stabs himself during stunt at holi celebrations

హోలి సంతోష, సంబరాల్లో నింపుకునే పండగే అయినా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దీనిని పీడ పండగ అనే అంటారు. ఈ పండగ రోజున అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుంటారు. కాముని పున్నమ అని కూడా పిలిచే ఈ పండగ రోజు.. ప్రాణాలు కూడా హరిస్తాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. అయితే అప్రమత్తతో వ్యవహరించకుంటే ఏ పండగ అయినా ప్రమాదకరమేనని మరికోందరి వాదన. అయితే ఈ పండగ రోజున యువత రంగులు చల్లుకుని ఎంచక్కా బండ్లపై తిరేగస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగి మరీ ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.

దీంతో ఎక్కడ అనుకోని ఘటనలు చోటుచేసుకుంటాయోనని ప్రభుత్వాలే హోలి పండగ రోజున మద్యం దుకాణాలను బంద్ చేయాలని అదేశాలను జారీ చేస్తోంది. అయితే ఉత్తర భారతావనిలో మాత్రం మద్యానికి బదులు వారు.. హోలీ రోజున పండ్ల రసాలతో బంగ్ తయారు చేసి.. దానిని సేవిస్తారు. ఇలా బంగ్ మత్తులో హోలీ రోజున ఓ రిపోర్టర్ ను ఓ యువకుడు వాహనంతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రతీ హోలీ పండగకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా హోలి సందర్భంగా మరో విషాదకర వీడియో నెటిజనులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో హోలి పండగ నేపథ్యంలో కామున్ని కాల్చిన తరువాత యువకులు హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో ఓ 38 ఏళ్ల వ్యక్తి తన చేతిలో వున్న కత్తితో స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తు పొడిచుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా నాలుగుసార్లు పొడుచుకున్న వ్యక్తి.. తరువాత తన శరీరం నుంచి రక్తం కారుతుండటంతో ఏంటా అని చూసి.. తన చేతి వంక చూశాడు. తన చేతిలో కత్తి వుందని.. దాంతో పోడిచేసుకున్నని తెలుసుకునే లోపు జరగరాని విషాదం జరిగిపోయింది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఇండోర్ లోని బంగంగా ప్రాంతంలో నివసించే గోపాల్ సోలంకీ.. తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. తన చేతిలో కత్తి పట్టుకుని స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు తనను తాను పొడుచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన యొక్క వీడియోలో అతిగా మద్య సేవించిన గోపాల్.. తాగిన మత్తులో తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. కత్తితో నాలుగు సార్లు తనను తాను పొడిచుకున్నాడు. అయితే వెంటనే గమనించిన కటుంబ సభ్యులు అతడ్ని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles