Bride refuses to marry groom wearing a wig పెళ్లివేదికపైనే సృహతప్పిన వధువు.. ఎందుకో తెలుసా..

Bride refuses to marry after finding groom wearing a wig

Uttar Pradesh, bride, refuse, Groom, wig, Bharthana area, Etawah district, Ajay Kumar, Bharthana, Etawah, UP, wig, groom wearing a wig, Bride refuses to marry, Uttar Pradesh

A bride refused to marry the groom on the wedding day after she saw him wearing a wig. The incident took place in the Bharthana area of the Etawah district on Wednesday night. The groom, Ajay Kumar, had to return home without getting married.

వరుడు విషయం తెలిసి.. పెళ్లివేదికపైనే సృహతప్పిన వధువు..

Posted: 02/26/2022 11:21 AM IST
Bride refuses to marry after finding groom wearing a wig

ఒక్కోసారి వదువును మోసం చేయాలన్న వరుల ప్రయత్నాలు బెడిసికోట్టి.. తాము ఏ విషయానైతే దాచాలని చూస్తామో.. అదే విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో అటు పరువు పోయి.. ఇటు వధువు పోయి.. రెండికి చెడ్డ రేవడిలా అవుతుంది జీవితం. ఇంత భారీ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నామంటే ఓ వ‌రుడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు బట్టతల అని వధువుతో చెప్పలేక.. పెళ్లి చేసుకున్నాక తెలిస్తే మాత్రం సర్ధుకుపోక ఏం చేస్తుందని అమెను ఈ విషయాలో ఏమార్చాలని ప్రయత్నం చేశాడు. అందుకని పెళ్లిలో తలపై విగ్గు ధ‌రించాడు. ఈ విషయం తెలిసిన వదువు అతనిని వివాహం చేసుకోనని తేల్చిచెప్పింది.

ఇకనేం.. అంగరంగవైభవంగా జరగాల్సిన కళ్యాణం.. పెళ్లి పీట‌ల‌పైనే ఆగిపోయింది. విగ్గు ధ‌రించిన వ‌రుడు నాకొద్దు అంటూ వ‌ధువు తెగేసి చెప్పింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎత‌వా జిల్లాలోని భ‌ర్త‌నా ఏరియాలో బుధ‌వారం రాత్రి వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అజ‌య్ కుమార్ అనే యువ‌కుడి వివాహం బుధ‌వారం రాత్రి జ‌ర‌గాల్సి ఉండే. అయితే అజ‌య్ కుమార్ ముస్తాబై వివాహ వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నాడు. వ‌ధువు కూడా పెళ్లి మండ‌పానికి చేరుకున్న‌ది. అజ‌య్ త‌న త‌ల‌పాగాను క్ష‌ణానికి ఒక‌సారి స‌ర్దుకుంటున్నాడు. దీంతో అనుమానం వ‌చ్చి పెళ్లి కూతురు అత‌ని త‌ల‌ను గ‌మ‌నించింది.

ఈ క్రమంలో అమె తరపు బంధువులో లేక స్నేహితులో కానీ అమెకు అసలు విషయం చేరవేశారు. వరుడు అజ‌య్ విగ్గు ధ‌రించిన‌ట్లు అమె చెవిలో ఊదారు. దీంతో అమె పెళ్లి పీటలపైనే సృహకోల్పోయింది. కొద్ది సేపటికి వధువు కొలుకున్న తరువాత అమె ఈ విగ్గు ధరించిన వరుడు తనకు వద్దని తెగేసి చెప్పింది. త‌న‌కు బ‌ట్ట‌త‌ల ఉన్న వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని తెగేసి చెప్పింది. ఆమె త‌ల్లిదండ్రులు ఎంత న‌చ్చ‌జెప్పినా వినిపించుకోలేదు. దీంతో వధువుతో సహా కలసి వెళ్లాల్సిన బరాత్ వధువు లేకుండానే తిరిగి  వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  refuse  Groom  wig  Bharthana area  Etawah district  Ajay Kumar  Bharthana  Etawah  Uttar Pradesh  

Other Articles