India Abstain From UN Vote On Ukraine Invasion రష్యా చర్యలపై యూఎన్ భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్‌ దూరం..

India explains move to abstain from un vote on ukraine invasion

UN Security Council, Russia-Ukraine conflict, Indians in Ukraine, Foreign Secretary Harsh Vardhan Shringla, Russia-Ukraine Crisis, UN meeting, Ukraine Crisis News, Russia Ukraine war, Russia Ukraine War news, Russia-Ukraine Crisis News, Ukraine Crisis Latest news, Ukraine Crisis News Today, Russia News, Ukraine News

India abstained on a US-sponsored UN Security Council resolution that deplored in the strongest terms Russia's aggression against Ukraine. New Delhi said dialogue is the only answer to settling differences and disputes and voiced "regret" that the path of diplomacy was given up.

రష్యా చర్యలపై యూఎన్ భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్‌ దూరం..

Posted: 02/26/2022 12:23 PM IST
India explains move to abstain from un vote on ukraine invasion

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో భద్రతా మండలిలో ఓటింగ్‌ నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.కాగా మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే భద్రతా మండలిలో అయిదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా.. తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది.

ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్న సందర్భంగా  ఐరాసలో భారతరాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి సూచించారు. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్‌ తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేసేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles