viral video: Ukrainian woman confronting Russian soldiers రష్యా సైనికుడిపై ఒంటికాలితో లేచిన ఉక్రెయిన్ మహిళ

Ukrainian woman confronts russian soldiers hailed as fearless

Henichesk woman, Brave Ukraine woman, woman confronts Russian solider, Russia Ukraine War, Ukraine crisis, Henichesk, Russian soldiers, Kyiv, Ukraine, Russia- Ukraine crises, woman russian soilder facists, woman russian soilder occupiers, woman russian soilder enemies. Ukraine

A Ukrainian woman confronting a heavily-armed Russian soldier and demanding to know what they were doing in her country has gone viral in social media, with many hailing her as “brave”. The woman, a resident of Henychesk, Kherson region, was seen voicing her outrage as Russia launched a full-scale attack on Ukraine, with tanks and jets covering various parts of the city and causing major destruction.

ITEMVIDEOS: రష్యాన్ సైనికులను.. ‘‘ఆక్రమణదారులు’’ అన్న ఉక్రెయిన్ మహిళ

Posted: 02/25/2022 08:49 PM IST
Ukrainian woman confronts russian soldiers hailed as fearless

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ అణుకేంద్రాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న రష్యా.. దాదాపుగా దానిని చేతబూనినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అదే సమయంలో ఉక్రెయిన్ రాజధాని కైవ్ ను కూడా రష్యా తమ కబంధ హస్తాలలోకి తీసుకుంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా స్పందిస్తోంది. లొంగిపోవాలన్న రష్యా సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌ సేనలు తమ తుదిశ్వాస వరకు పోరాడుతున్నారు. మరోవైపు రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వారికి మరింత ధైర్యాన్నిచ్చే ఘటన హెన్‌చెస్క్‌ లో చోటుచేసుకుంది.

తమ దేశంలోకి వచ్చిన ఓ రష్యన్‌ సైనికుడిని ఉక్రెయిన్‌ మహిళ నిలదీసింది. చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న సైనికుడి వద్దకు ఎదురెళ్లిన మహిళ.. నా గడ్డమీద నీకేం పని..? అంటూ తలపడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హెన్‌చెస్క్‌ నగరంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ఉక్రెయిన్‌ మహిళ, భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఓ సైనికుడి దగ్గరకు వెళ్లి నీవెవరూ..?అంటూ ప్రశ్నించింది. మేం కవాతు చేస్తున్నాం.. మీరు వెళ్లిపోండి అంటూ అతడు జవాబిచ్చారు. అయితే, సదరు వ్యక్తి రష్యా సైనికుడని అర్థం చేసుకున్న ఆ మహిళ.. మీరు ఇక్కడేం చేస్తున్నారు..? అంటూ మరోసారి ప్రశ్నించింది.

దీంతో మనం వాదించుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆ సైనికుడు బదులిచ్చాడు. అతడు చెప్పిన మాటలకు భయపడకుండా మరో అడుగు ముందుకేసిన ఆ మహిళ.. ‘మీరు ఆక్రమణదారులు, మీరు నియంతృత్వవాదులు, ఇలాంటి ఆయుధాలను పట్టుకొని మా పురిటి గడ్డమీద ఏం చేస్తున్నారు? ఈ విత్తులు తీసుకొని జేబులో వేసుకో. నేలకొరిగిన తర్వాత కనీసం పొద్దుతిరుగుడు (ఉక్రెయిన్‌ జాతీయ పుష్పం) పువ్వులైనా పూస్తాయ్‌..’ అంటూ రష్యా సైనికుడితో తలపడింది. ఈ ఘటనను అక్కడివారు పోన్లతో బంధించిన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘ఆ మహిళ ఎంతో ధైర్యవంతురాలు, రష్యన్‌ సైన్యం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన తీరు నిజంగా అద్భుతం, మా మద్దతు మీకే, వీ వెంటే ఉన్నాం’ అంటూ సదరు మహిళపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే, సైనిక చర్యలో దూకుడుగా వెళ్తోన్న రష్యా సేనలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపానికి చేరువయ్యాయి. వాటిని దీటుగా ప్రతిఘటిస్తోన్న ఉక్రెయిన్‌ సేనలు తమ ప్రాంతాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ దాడుల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కానీ ఈ దాడుల్లో ఇప్పటికే 450 మంది రష్యా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్‌ రక్షణశాఖ అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles