Accused’s wife moves court alleging hand of kin in YS Viveka case సీబిఐ దర్యాప్తు ఏకపక్షమంటూ నిందితుడి భార్య పిటీషన్

Ys viveka murder case shivshanker reddy wife tulasamma moves court alleging hand of kin

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Tulasamma, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Even as the CBI has intensified its investigation into the YS Vivekananda Reddy murder case by making one of the accused in the case an approver, D Tulasamma, wife of another accused Shiva Shankar Reddy, filed a petition in court seeking directions to file cases against Vivekananda Reddy’s son-in-law N Rajasekhar Reddy, his brother Siva Prakash Reddy and four others alleging their involvement in the murder of the former minister.

సీబిఐ దర్యాప్తు ఏకపక్షమంటూ వైఎస్ వివేకా కేసు నిందితుడి భార్య పిటీషన్

Posted: 02/24/2022 01:44 PM IST
Ys viveka murder case shivshanker reddy wife tulasamma moves court alleging hand of kin

వివేకా హత్య కేసులో అయిదో నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె తన పిటిషన్‌లో వివేకా హత్యకేసు ఏకపక్షంగా సాగుతోందని పేర్కోన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థగా వున్న సీబిఐ.. ఒకే కోణంలో దర్యాప్తును చేపడుతుందే తప్ప.. ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నేత టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తదితరులను విచారించడం లేదని అన్నారు.

వైఎస్ వివేకా హత్య రాజకీయపరంగా జరిగివుండవచ్చును లేదా.. తన ఆస్తి వ్యవహారాల విషయమై కూడా జరిగి వుండవచ్చునని అమె తన పిటీషన్లో పేర్కోన్నారు. దీంతో అనుమానితులుగా వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్లను కూడా చేర్చి దర్యాప్తు చేయాలని ఆమె పేర్కొన్నారు. అమె ఈ నెల 21న దాఖలు చేసిన పిటిషన్‌ వివరాలను విడుదల చేశారు. సీబీఐ అధికారులు కేసును ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని, మరో కోణంలో విచారణ చేయట్లేదని ఆరోపించారు.

అసలైన నిందితులను కాకుండా.. కేసుతో సంబంధంలేని తన భర్తను సీబీఐ అరెస్టు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి, వై.జి.రాజేశ్వర్‌రెడ్డి, నీరుగట్లు ప్రసాద్‌ను అనుమానితులుగా చేర్చారు. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గొడవ కారణంగానే వివేకా హత్య జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా.. ఏకపక్షంగా చేస్తోందని ఆరోపించారు.

వివేకా రెండోపెళ్లి చేసుకున్నారని, ఓ కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. బెంగళూరులో భూమి సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బుల్లో రూ.2 కోట్లు రెండో భార్యకు ఇస్తానని వివేకా చెప్పారని, కొంత ఆస్తి కూడా ఆమె పేరిట రాశారని వివరించారు. ఈ విషయమై వివేకాకు.. కుటుంబసభ్యులకు గొడవలు ఉన్నాయని, ఈ కారణంగానే ఆయన భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో కూతురు సునీత వద్ద ఉన్నట్లు తెలిపారు. రెండో భార్యను అల్లుడు పలుమార్లు బెదిరించారని, ఈ విషయంలో పెద్ద వివాదమే ఉన్నట్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles