Ukraine's Zelenskiy calls on citizens to fight, promises weapons వేర్పాటువాదులకు రక్షణగానే ఉక్రెయిన్ పై సైనిక చర్య: పుతిన్

Massive explosions reported in eastern ukraine after putin s military operation order

Russia Ukraine Crisis News, Russia Ukraine war, russia Ukraine crisis, russia forces at Ukraine border, russia attack Ukraine, russia Ukraine War news, russia Ukraine Conflict News, world war 3, world war 3 News, world war 3 updates, world war 3 today latest updates, russia Ukraine world war 3, world war 3 reason, russia Ukraine War reason, russia forces at Ukraine border, russia war with Ukraine, russia Ukraine news, russia Ukraine Conflict News updates, MOEX Russia Index, Russian Stock Market Index, Moscow Exchange, Russia Ukraine news India, russia ukraine news, ukraine news, ukraine russia news, russia, russia ukraine, russia ukraine latest news, putin, russia ukraine crisis, russia news

Ukrainian President Volodymyr Zelenskiy on Thursday called on all citizens who were ready to defend the country from Russian forces to come forward, saying Kyiv would issue weapons to everyone who wants them. Zelenskiy also urged Russians to come out and protest against the war.

వేర్పాటువాదులకు రక్షణగానే ఉక్రెయిన్ పై సైనిక చర్య: పుతిన్

Posted: 02/24/2022 12:43 PM IST
Massive explosions reported in eastern ukraine after putin s military operation order

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ మొదలైందని ప్రకటించారు. డోన్భాస్‌లో ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీచేశారు. డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరించింది. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించి దానిని హస్తగతం చేసుకుంది.

ప్రపంచ దేశాలు వద్దని కోరుతున్నా పుతిన్ పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపారు. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది. తాజా పరిస్థితులపై చర్చిస్తోంది. కాగా, రష్యా దాడికి ప్రతిచర్య తప్పదని, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెచ్చరించారు. ఉక్రేయిన్ పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలకు రష్యా తప్పక బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. యుద్ధం వల్ల సంభవించే మరణాలు, సంక్షోభాలకు రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

కాగా, ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. తమకు మిలిటరీ పరమైన సహాయం చేయాలంటూ ఉక్రెయిన్ వేర్పాటువాదులు విన్నవించిన తర్వాత రష్యా నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. మరోవైపు రష్యాను ఉద్దేశించి నిన్న రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్వేగభరితమైన విన్నపం చేశారు. యూరప్ లో పెద్ద యుద్ధానికి తెరతీయవద్దని రష్యాను కోరారు. ఉక్రెయిన్ లో రష్యా జాతి ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు. పుతిన్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని... కానీ పుతిన్ నుంచి స్పందన లేదని, కేవలం మౌనమే సమాధానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా బలగాలు చొచ్చుకుపోయాయి. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపులా రష్యన్ బలగాలు మోహరించాయి. దాదాపు 1.50 లక్షల రష్యన్ సైనికులు యుద్ధరంగంలో ఉన్నారు. ఉక్రెయిన్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పుతిన్ అడుగులు వేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. మరోవైపు యుద్ధం ప్రారంభమైన వెంటనే... ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమయింది. పరిస్థితిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది.

రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 18 చోట్ల ఇప్పటికే 300 మంది పౌరులు మరణించారు. 23 ప్రాంతాల్లో రష్యా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఎటాక్‌ జరుపుతోంది. ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌లో 300 మంది పౌరులు మృతి చెందారు. రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles