TTD and Kishkinda Trusts Fight Over Hanuman's Birthplace టీటీడీపై గోవిందానంద సరస్వతి సంచలన ఆరోపణలు

Hanuman janmabhoomi swami govindananda saraswati sensational comments on ttd

Ram Janmabhoomi, hanuman janmabhoomi, Tirupati Tirumala Devasthanam, TTD, Tirumala, Sri Hanumad Janmabhoomi Teertha Kshetra Trust, Swami Govindananda Saraswati, Valmiki Ramayana, Anjanahalli, Kishkindha, banks of the Tungabhadra River, Hampi, Karnataka, Devotional

Tirumala Tirupati Devasthanam, in Andhra Pradesh has planned a ceremony to develop facilities at Anjanadri, a temple and pilgrimage site in the Tirumala Hills. The Sri Hanumad Janmabhoomi Teertha Kshetra Trust in Karnataka and Swami Govindananda Saraswati, claims Valmiki Ramayana specifies Hanuman was born at Anjanahalli in Kishkindha, which was believed to have been located on the banks of the Tungabhadra River near Hampi.

హనుమ జన్మభూమి: టీటీడీపై గోవిందానంద సరస్వతి సంచలన ఆరోపణలు

Posted: 02/15/2022 01:14 PM IST
Hanuman janmabhoomi swami govindananda saraswati sensational comments on ttd

తిరుమల తిరుపతి దేవస్థానంపై శ్రీ హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తుల విశ్వాసాలు, నమ్మకాలను పక్కద్రోవ పట్టించి.. చరిత్రను కాదని అసత్య కథనాలను ప్రచారం చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అరోపించారు. హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని ఆయన అన్నారు. కర్ణాటక కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించారని చెప్పారు. తిరుపతిలో గోవిందానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దైవద్రోహం చేస్తున్నదని విమర్శించారు.

దేశంలోని హైందవులను మోసం చేయడానికి టీటీడీ యత్నిస్తోందని అరోపించారు. కేవలం ధనం ఉందని అసత్యకథనాలు సృష్టిస్తోందని ఆయన పేర్కోన్నారు. స‌న్యాసుల‌ను, చరిత్రకారులను, భక్తులను, ప్రజ‌ల‌ను టీటీడీ మోసం చేస్తోంద‌ని, అంజ‌నాద్రి పేరుతో తిరుమ‌ల‌లో దుకాణాలు ఏర్పాటు చేయడానికి, టీటీడీ ప్రయ‌త్నాలు జ‌రుపుతున్నార‌ని విమర్శించారు. డ‌బ్బులు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా టీటీడీ పాల‌క మండ‌లి ప్రయ‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపణలు గుప్పించారు. మ‌రోవైపు, రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి క‌ర్ణాట‌క సీఎం ఇప్పటికే ప్రక‌ట‌న చేశార‌ని, కిష్కింద‌లోని పంపా తీరంలోనే హనుమంతుడు పుట్టాడని అందరూ అంగీకరించారని గోవిందానంద సరస్వతీ స్పష్టం చేశారు.

హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకం ముద్రించి తిరుమల తిరుపతి దేవస్థానం మోసగిస్తున్నదని అన్నారు. హనుమంతుని జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టించారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించేవారిని వదలిపెట్టబోమని హెచ్చరించారు. వాల్మీకీ రామాయణంలో హనుమంతుడి జన్మస్థలంపై అప్పుడే వాల్మీకీ మహర్షి వివరించారని ఆయన అన్నారు. హనుమత్‌ జన్మతీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టామని, 12 ఏండ్ల పాటు రథం దేశవ్యాప్తంగా తిరుగుతుందని చెప్పారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని రథయాత్ర సందర్భంగా ప్రజలకు చెప్తామన్నారు. రూ.1,200 కోట్లతో కిష్కింధ అభివృద్ధిని కర్ణాటక సీఎం ప్రకటించారని గోవిందానంద తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles