'completely meaningless',: Bihar CM Nitish on Hijab Row హిజబ్ పై వివాదం అర్థరహితం: నితీశ్ కుమార్

Hijab not an issue in bihar we respect religious sentiments nitish kumar

Nitish Kumar, Nitish Kumar on hijab, hijab row, hijab controversy, hijab case, karnataka hijab controversy, Bihar CM Nitish Kumar, Bihar CM, Nitish Kumar, Hijab Row, Nitish Kumar on Hijab Row, Respect, religious sentiments, Karnataka hijab row, Bihar, Politics

Bihar Chief Minister Nitish Kumar has played down the Hijab controversy which has been raging in the country and said that in Bihar this is not an issue as people respect each other's religious sentiments. Talking with the media, Kumar said, "In Bihar schools, children wear the same type of dress... We respect each other's religious sentiments."

కర్నాటకలో రేగిన హిజబ్ వివాదంపై నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Posted: 02/15/2022 12:22 PM IST
Hijab not an issue in bihar we respect religious sentiments nitish kumar

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కర్ణాటక హిజాబ్ వివాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశమై జరుగుతున్న వివాదం నిస్పందేహంగా అర్థరహితమైనదని ఆయన పేర్కోన్నారు. తమ రాష్ట్రంలో హిజాబ్ అనేది ఒక సమస్యే కాదని స్ఫష్టం చేశారు. మతపరమైన సెంటిమెంట్లను తాము గౌరవిస్తామన్నారు. అసలు బీహార్‌లో హిజాబ్ అనేది సమస్యే కాదని, దీనిపై మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇదంతా పనికిమాలిన వ్యవహారమని, దాని గురించి పట్టించుకోబోమని తేల్చి చెప్పారు.

బీహార్‌లోని పాఠశాలల విద్యార్థులందరూ ఒకే విధమైన యూనిఫాం ధరించే స్కూలుకు వస్తారని, ఎవరైనా తమ తలపై ఏదైనా ధరించి వచ్చినా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరికీ తమదైన జీవన విధానం ఉంటుందని.. ఈ క్రమంలో వారి మతపరమైన విశ్వాసాలు కూడా జోడించి వుంటాయని అన్నారు. అసలు అలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ప్రభుత్వానికి అందరూ సమానమేనని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను పెద్దదిగా చేయడం, వాటిపై ఇన్నాళ్లకు చర్చ లేవనెత్తడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటకలోని ఉడిపి ప్రీ యూనివర్సిటీ కాలేజీలోకి హిజబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను అనుమతించకపోవడంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి వివాదం ప్రారంభమైంది. ఉడిపిలోని ఒక్క కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా జిల్లాలోని ఇతర కాలేజీలకు, పాఠశాలలకు పాకింది. ఇక అక్కడి నుంచి పొరుగు జిల్లాలకు, పోరుగు రాష్ట్రాలకు పాకి ఏకంగా దేశవ్యాప్తంగా హిజబ్ చర్చనీయాంశంగా మారింది. ముస్లిం యువ‌తులకు ప్ర‌తిగా హిందూ విద్యార్ధులు కాషాయ శాలువాలు క‌ప్పుకుని కాలేజీలకు రావడంతో వివాదం మరింతగా రాజుకుంది. దీంతో ఈ అంశంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles