India to vaccinate 12-14yr olds by March త్వరలో 12 ఏళ్లుకు పైబడిన పిల్లలకు కరోనా టీకా: నీతి అయోగ్ ఛీఫ్

India to begin vaccinating 12 14 year olds against covid by march ntagi chief

India, Coronavirus, Covid-19 vaccine, Coronavirus news, Covid-19 vaccine news, india vaccination children, india vaccine kids, covid in india, corona in india

India will begin vaccinating 12-14-year-olds by March of this year, Dr NK Arora told. A renowned public health expert, Dr Arora is chairman of the central government's COVID-19 Working Group of the National Technical Advisory Group on Immunisation (NTAGI).

త్వరలో 12 ఏళ్లుకు పైబడిన పిల్లలకు కరోనా టీకా: నీతి అయోగ్ ఛీఫ్

Posted: 01/17/2022 06:20 PM IST
India to begin vaccinating 12 14 year olds against covid by march ntagi chief

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు 60 ఏళ్లకు పైబడిన వయోజనులకు ప్రికాషనరీ కింద బూస్టర్ డోస్ ప్రక్రియ కూడా జనవరి 10 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక అదే విధంగా ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల బాలబాలికలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఈ వయస్సులోని పిలల్లు పోటీపడి మరీ వాక్సీన్ తీసుకోవడంతో ఈ గ్రూప్ వారికి శరవేగంగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే ఏకంగా మూడున్నర కోట్ల మంది యువ బాలబాలికలకు ఈ వాక్సీన్ ఇచ్చినట్టు కేంద్ర గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయినప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారి సంఖ్య ఇప్పటికీ దేశంలో ఎక్కువగానే ఉంది. ఇలాంటి వారి కోసం హర్ గర్ దస్తాక్ అంటూ ప్రతీ ఇంటికీ వెళ్లి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇదిలావుండగా పలు దేశాలు బాలబాలికలకు కూడా కరోనా వాక్సీన్ ను అందజేస్తున్న తరుణంలో భారత్ కూడా మరో అడుగు ముందుకేసింది. త్వరలోనే 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కె.అరోరా దీనిపై మాట్లాడుతూ, 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు మార్చి నుంచి టీకాలు అందించే అవకాశముందని వెల్లడించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు.

ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం, 15 ఏళ్లకు లోపు వారికి వాక్సినేషన్ విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారని, 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారని అరోరా తెలిపారు. మిగిలిన వారికి ఈ నెలాఖరు కల్లా తొలి డోసు ఇస్తామని, తద్వారా వారు ఫిబ్రవరి చివరి నాటికి రెండో డోసు కూడా తీసుకుంటారని చెప్పారు. 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసు వారు దేశంలో 7.5 కోట్ల మంది ఉంటారని డాక్టర్ అరోరా సూచనప్రాయంగా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles