పంజాబ్ లో ఈ నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరన్ జీత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపి, అప్ సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. వాస్తవానికి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా రాజకీయ పార్టీల నుండి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
అయితే, ఫిబ్రవరి 16న వారణాసిలో గురు రవిదాస్ జీ జయంతి వేడుక కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో (దాదాపు 20 లక్షల మంది) భక్తులు తరలి వెళ్లనున్నారు. వారంతా వారం ముందే వారణాసి బయల్దేరతారని.. ఈ క్రమంలో ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల తేదీని వాయిదా వేయని పక్షంలో వీరంతా ఎన్నికలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. చన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ సహా బీజేపి, అప్ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఈ విషయమై ఎన్నికల తేదీని మార్చాలని విన్నవించాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నుంచి వినతువు వెలువడంతో ఎన్నికల తేదీని మార్చింది ఎన్నికల సంఘం.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో సమీక్షించిన తరువాత.. ఓ ప్రకటన విడుదల చేస్తూ, గత కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇతర సంస్థల నుండి అనేక ప్రాతినిధ్యాలను స్వీకరించిందని, అదే సమయంలో జరుపుకునే మతపరమైన పండుగపై దృష్టి సారించింది. గురు రవిదాస్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 16కు ఒక వారం ముందు నుండి పంజాబ్ నుండి వారణాసికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని.. అందువల్ల పంజాబ్ పొలింగ్ తేదీని 14 నుంచి 20కి మార్చుతున్నామని ఎన్నికల సంఘం పేర్కోనింది.
పంజాబ్ కోసం కొత్త సంబంధిత తేదీలు:
1. నోటిఫికేషన్ తేదీ: జనవరి 25, 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2022 (మంగళవారం)
3. పరిశీలన తేదీ: ఫిబ్రవరి 2, 2022 (బుధవారం)
4. ఉపసంహరణ తేదీ: ఫిబ్రవరి 4, 2022 (శుక్రవారం)
5. పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20, 2022 (ఆదివారం).
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10 న జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more