All non-BJP parties must support Utpal Parrikar: Sanjay Raut ఉత్పల్ పారికర్ కు బీజేపీయేతర పార్టీలన్నీ మద్దుతునివ్వాలి: రౌత్

All non bjp parties should support manohar parrikar s son utpal parrikar sanjay raut

Goa Election, BJP, Sanjay Raut, Shiv Sena, Utpal Parrikar, Manohar Parrikar, chief minister, Congress, AAP, TMC, Politics

Shiv Sena leader Sanjay Raut has said that all non-BJP parties should come together to support Manohar Parrikar's son Utpal Parrikar if he contests next month's Goa election. Raut tweeted, "If Utpal Parrikar contests Independent from Panaji seat, I propose all non-BJP parties including Aam Aadmi Party, Congress, Trinamool Congress and Goa Forward Party should support his candidature and not field a candidate against him. This will be a true tribute to ManoharBhai!"

పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపియేతర పార్టీలన్నీ మద్దుత్తునివ్వాలి: రౌత్

Posted: 01/17/2022 07:54 PM IST
All non bjp parties should support manohar parrikar s son utpal parrikar sanjay raut

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత  ఇవ్వలేదు. అయితే బీజేపి అవలంబిస్తున్న తాత్సార ధోరణి, నిర్లక్ష్య వైఖరిపై ఆయన పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేరచరిత్ర కలిగిన నేతలకు టికెట్టు ఇస్తారా.? అందకనే తనకు టికెట్ ఇవ్వడంపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదా.? అని ఆయన నేరుగా బీజేపి రాష్ట్రాస్థాయి నేతలను టార్గెట్ చేశారు.

ఇదిలావుండగా, ఉత్పల్‌ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించిన మనోహర్ పారికర్ కు నిజమైన నివాళిని అర్పించేందుకు ప్రత్యర్థి పార్టీలకు మంచి అవకాశం లభించిందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అన్నారు. పారికర్ వారసుడైన ఉత్పల్ కు పానాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి పోటీ లేకుండా మద్దతు ఇస్తాయని ఆయన తెలిపారు. ఉత్పల్‌ పారికర్‌ కు మద్దతుగా కాంగ్రెస్‌, ఆప్‌, తృణమూల్ తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్‌ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు.

తద్వారా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ఉత్పల్‌ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్‌ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్‌ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌ దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్‌ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa Election  BJP  Sanjay Raut  Shiv Sena  Utpal Parrikar  Manohar Parrikar  chief minister  Congress  AAP  TMC  Politics  

Other Articles