దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు ప్రమాద గంటికలు మోగిస్తూనేవుంది, అయితే ఇప్పటికీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో.. వారం రోజుల వ్యవధిలో లక్షన్నర కేసులు నమోదుకాగా, ఇక తాజాగా పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్ష 79 వేల కేసులు నమోదయ్యాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1వ తేదీన 27,553 కేసులు నమోదు కాగా, అందులో కేవలం 309 ఒమిక్రాన్ కేసులు ఉండగా, జనవరి 11న లక్ష 79 వేల కేసులు నమోదయ్యాయి. వాటిలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఏకంగా 4033గా నమోదయ్యాయని కేంద్ర అరోగ్య మంత్రిత్వశాఖ గణంకాలు వెల్లడించాయి. దీన్ని బట్టి ఒమిక్రాన్ వ్యాప్తి వేగం ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ఐదు నుండి 10 శాతం క్రియాశీల కోవిడ్ కేసులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం అరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి మరింత పెరిగి రోజువారి కేసుల కూడా గణనీయంగా పెరుగుతాయని.. ఈ పరస్థితుల్లో అసుపత్రులలో చేరికలు మరింతగా పెరగవచ్చునని అన్నారు. ఈ అత్త్యక పరిస్థితులు ఏర్పడక ముందే అసుపత్రులలో మరిన్ని బెడ్లు, అక్సిజన్ స్థాయిలను సమృద్దిగా ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. దేశంలో కోవిడ్ రెండవ దశ సమయంలో, ఆసుపత్రి సంరక్షణ అవసరమయ్యే క్రియాశీల కేసుల శాతం 20-23 శాతం పరిధిలో ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు డెల్టా యొక్క నిరంతర ఉనికి ద్వారా నడపబడుతున్నట్లు కనిపిస్తోంది, కోవిడ్ నిర్వహణ కోసం మానవ వనరులను, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను పెంపొందించడంపై ఆయన నొక్కి చెప్పారు. "ప్రస్తుత ఉప్పెనలో, ఇప్పటివరకు ఐదు నుండి 10 శాతం యాక్టివ్ కేసులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది. పరిస్థితి డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతోంది. అందువల్ల, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా వేగంగా మారవచ్చు" అని భూషణ్ చెప్పారు. ఇక ఇవాళ తాజాగా నమోదైన కేసులు 179,723గా ఉండగా, మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య 723,619కి పెరిగింది,
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more