BJP Ahead So Far In UP & Uttarakhand, hung in Manipur సీ-ఓటర్ సర్వే: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముందన్న పార్టీలివే

Abp c voter survey bjp ahead so far in up uttarakhand challenge for congress in punjab

Punjab, uttar Pradesh, Uttarakhand, Goa, Manipir, ABP News C-Voter Survey, ABP News C-Voter Survey Uttar Pradesh, ABP News C-Voter Survey Punjab, ABP News C-Voter Survey Uttarakhand, ABP News C-Voter Survey Goa, ABP News C-Voter Survey Manipur, Congress, BJP, AAP, SP, BSP, SAP, Assembly Elections, Politics

Uttarakhand, Punjab, Uttarakhand, Manipur and Goa are all set to witness the assembly elections, according to ABP-CVoter opinion polls, BJP seems to be returning to power in Uttar Pradesh. In Punjab, 32 per cent of the people are in support of AAP forming the government. Survey sought to know which party do people of Uttarakhand, Manipur and Goa support.

సీ-ఓటర్ సర్వే: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముందన్న పార్టీలివే

Posted: 01/11/2022 01:52 PM IST
Abp c voter survey bjp ahead so far in up uttarakhand challenge for congress in punjab

దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఓ వైపు అధికార బీజేపికి దెబ్బ మీద దెబ్బ తాకుతున్నా.. మళ్లీ ఆ పార్టీయే పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని సర్వేల ఫలితాలు వల్లడిస్తున్నాయి. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఈ ఎలెక్షన్స్ ను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల తరువాత మరోమారు సెకెండ్ సెమీఫైన్సల్ గా రావాల్సిన హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల ఎన్నికల లేకుండా ఓ వైపు జెమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం ప్లాన్ చేస్తుందన్ని వార్తలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు తదుపరి లోక్ సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటుంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రాష్ట్రం నుంచి గత ఎన్నికల ఫలితాలను దాదాపుగా పునరావృతం చేయాలని కాషాయ పార్టీ భావిస్తున్నా.. అది సాధ్యం కాదని, ఈ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీతో బీజేపి నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడాల్సివస్తుందని వార్తలు అందాయి, అయితే ఏబీసి-సీ ఓటర్ మాత్రం బీజేపి మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని, అయితే సమాజ్ వాదీ పార్టీ ఆ తరువాత అద్యధిక స్థానాలు సంపాదించిన పార్టీగా నిలుస్తుందని తెలిపింది. లోక్ సభకు ఏకంగా 80 మంది పార్లమెంటు సభ్యులను పంపే ఈ రాష్ట్రంపైనే ప్రధానంగా దేశప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. దీంతో, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటుంది.

ఇక జరగబోయే ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటి, చరిత్ర సృష్టిస్తుందని 'ఏబీపీ సీ ఓటర్' సర్వే తేల్చిచెప్పింది. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎం కాబోతున్నారని తెలిపింది. అయితే గతంలో సాధించిన మెజారిటీ మాత్రం కానరాదని పేర్కోంది. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 235 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది. అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ 157, మాయావతికి చెందిన బీఎస్పీకి 16 స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోబోతోంది. ఇండియాలో ఓల్డ్ గ్రాండ్ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్... 10 లోపు స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలింది. బీజేపీకి 41.5 శాతం ఓట్లు రావచ్చని తెలిపింది.  

మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వా? నేనా? అనే రీతిలో ఉంటుందని సర్వేలో తేలింది. ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపి పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం కాసింత కష్టసాధ్యమైన పనేనని.. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో ఇందుకోసం చాలా కష్టపడాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇక సీ ఓటర్ మాత్రం ఉత్తరాఖండ్ లో హంగ్ ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పింది. అటు గోవాలో అధికార బీజేపికి ఈ సారి పరిస్థితులు తారుమారు అవుతాయని అక్కడి తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తుండగా, సర్వే మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది.

ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటబోతోందని సర్వేలో వెల్లడైంది. అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ సారి పరాభవం తప్పదని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ పీఠం మాత్రమే కాదు.. పంజాబ్ పీఠాన్ని కూడా అధిరోహించేందుకు అప్ ప్రభుత్వం సిద్దంగా వుందని తెలిపింది. ఆప్ కు 58, కాంగ్రెస్ కు 43 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. శిరోమణి అకాలీదళ్ కు 23 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురుకాబోతోంది. బీజేపీ 3 స్థానాలకు మాత్రమే పరిమితం కానుందని తేలింది. సర్వేలో తేలిన విధంగా పంజాబ్ లో ఆప్ గెలిస్తే... ఆ పార్టీ ఢిల్లీ వెలుపల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టవుతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుంటున్న ఆప్ కు... ఈ గెలుపు ఇతర రాష్ట్రాల్లో సైతం బలోపేతం కావడానికి కావాల్సినంత స్థైర్యాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  uttar Pradesh  Uttarakhand  Goa  Manipir  ABP News C-Voter Survey  Congress  BJP  AAP  SP  BSP  SAP  Assembly Elections  Politics  

Other Articles