దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు మాటువేసింది. మరీ ముఖ్యంగా వాక్సీన్ వేయించుకున్న వారి నుంచి చిన్నారులకు సోకుంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ బారినపడి అసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. నూతన సంవత్సర ఆరంభం నుంచి పరిశీలిస్తే.. గత పది రోజులగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇదివరకే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటెన్ సహా పలు దేశాల్లో నమోదవుతున్నట్లుగానే మన దేశంలోనూ చిన్నారులు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. రోజూ ముగ్గురు నుంచి ఐదుగురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే ఈ చిన్నారులతో పాటు ఏడాదిలోపు శిశువులు కూడా ఒమిక్రాన్ బారిన పడటం గమనార్హం.
పలువురు శిశువుల్లో ఒమిక్రాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మూడు నెలల్లోపు శిశువులకు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు వస్తాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే చిన్నారులకు, శిశువులకు కుటుంబంలోని మిగతా సభ్యుల ద్వారా ఒమిక్రాన్ బారిన పడుతున్నారని పిడియాట్రిషన్లు చెబుతున్నారు. బయట నుంచి వచ్చి నేరుగా చిన్నారులు చెంతకు తీసుకోవడం ముఖ్యకారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. అయితే ఇలా వైరస్ బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. రెండు రోజుల పాటు స్వల్ప స్థాయి జ్వరం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం రావడంతో చిన్నారులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిలోనూ కేసులు బయటపడుతున్నాయి.
మరోపక్క, నీలోఫర్ ఆసుపత్రిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం ఒక్కసారిగా వస్తున్నాయని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ‘‘ఫ్లూ, కోవిడ్ మధ్య తేడాలను గుర్తించడం కష్టం. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కరోనా టీకాలను తీసుకున్నవారే. వీరికి కరోనా సోకినా లక్షణాలు పెద్దగా కనిపించడంలేదు. అయితే, వీరి నుంచి పిల్లలకు కరోనా సోకుతున్నట్టు తెలుస్తోంది’’ అని ఓ వైద్యుడు పేర్కొన్నారు. ‘‘గత కొన్ని రోజులుగా కేసులు పెరగడం చూస్తున్నాం. ఎక్కువ శాతం అవుట్ పేషెంట్, ఆన్ లైన్ కన్సల్టేషన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి రోజుకు నాలుగైదు అడ్మిషన్లు కూడా కనిపిస్తున్నాయి’’ అని లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ ఘంటా తెలిపారు.
ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 179,723 కేసులు నమోదు కాగా, ఇవి గతేడాది మే నెలలో నమోదు చేసుకున్న గరిష్టస్థాయిని అందుకోవడం గమనార్హం. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగాన్ని అందుకుని తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రోజువారీ కేసుల సంఖ్య ఎప్పడులేని విధంగా లక్షల్లో నమోదు అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య 723,619కి పెరిగింది, ఇది దాదాపు 204 రోజులలో అత్యధికం, మరణాల సంఖ్య 146 మరణాలతో 4,83,936కి పెరిగింది. ఓమిక్రాన్ వేరియంట్ యొక్క మొత్తం 4,033 కేసులలో, 1,552 కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,216 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా, రాజస్థాన్ 529, ఢిల్లీ 513, కర్ణాటక 441, కేరళ 333, గుజరాత్ 236 కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more