SC Lawyers get threatening calls from Sikhs For Justice ప్రధాని కాన్వాయ్ అడ్డగింత విచారణను నిలివేయండీ: ‘సిక్స్ ఫర్ జస్టిస్’

Sc lawyers get threatening calls from khalistani organisation sikhs for justice

modi punjab rally, modi ferozepur, modi, pm modi, Farmers Protest, khalistani terrorists, lawyers, Sikhs for justice, supreme court, threat calls, assembly elections 2022, assembly elections latest news, assembly elections covid19 guidelines, Punjab assembly elections, Punjab elections, BJP, PM Modi, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, election commission, election press conference, election 2022, state assembly election 2022, assembly election 2022 dates, punjab election 2022, punjab assembly election 2022 dates, punjab election 2022 schedule, punjab state assembly election 2022 dates, punjab assembly election 2022 schedule, election 2022 news

Hours after it was reported that Supreme Court lawyers were getting threatening calls from Khalistani terror group Sikhs for Justice, a transcript of the threat call has emerged. A social media user Priyang Pandey tweeted the details of a number registered in the UK, from which many lawyers got threat calls from the SFJ earlier in the day.

ప్రధాని కాన్వాయ్ అడ్డగింత విచారణను నిలివేయండీ: వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’

Posted: 01/11/2022 10:33 AM IST
Sc lawyers get threatening calls from khalistani organisation sikhs for justice

ప్ర‌ధాని నరేంద్రమోడీకి పంజాబ్ పర్యటలో భ‌ద్ర‌తా వైఫల్యం అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఇది అంత‌ర్జాతీయంగా దేశ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చింద‌ని, ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు పెనుముప్పు ఉన్న‌ట్లు తేలింద‌ని బీజేపి నేతలు ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు. ఇక పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయనకు శత్రుదేశం మిసైళ్ల పరిధిలో ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెరపైకి వేర్పాటువాద సిక్కుల సంఘం వచ్చింది. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయవాదులకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి ప్రధాని కాన్వాయ్ నిలిపివేత అంశంపై సుప్రీంకోర్టులో విచారణను నిలిపివేయాలని బెదిరింపులకు పాల్పడింది.

అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) కీలక ప్రకటన చేసింది. మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనని ప్రకటించినట్టు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిన్న కోర్టు దష్టికి తీసుకెళ్లింది. మోదీ కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడానికి కారణం తామేనని, భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, ఈ ఘటనపై ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపవద్దని న్యాయవాదులను బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయవాదుల సంఘం పేర్కొన్న ప్రకారం.. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిన్న ఉదయం 10.40 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 12.36 గంటలకు మరోసారి రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. మోదీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనక ఉన్నది తామేనని అందులో వారు అంగీకరించారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టవద్దని ఆ ఫోన్‌కాల్‌లో హెచ్చరించారు. అంతేకాదు, విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరించినట్టు ధర్మాసనానికి రాసిన లేఖలో న్యాయవాదుల సంఘం పేర్కొంది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని న్యాయవాదులు తమ ఫోన్లలో సేవ్ చేసుకున్నారని, అవి కనుక హ్యాకింగ్‌కు గురైతే ఆ వివరాలన్నీ దుర్వినియోగం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇలాంటి ఫోన్‌కాల్స్ న్యాయవాదులందరికీ వస్తున్నట్టు పేర్కొంటూ దీపక్ ప్రకాశ్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles