Naga Ramakrishna text messaged his friend on his selfie videos సెల్ఫీ వీడియోల విషయాన్ని స్నేహితుడికి తెలిపిన రామకృష్ణ

Naga ramakrishna text messaged his friend on his selfie videos against trs mla s son

vanama raghavender, Family suicide, Telangana police, Abetment of suicide, Vanama Venkateswara Rao, Ramakrishna, Family Suicide, Palwancha suicide case, Raghavender video, family suicide case, Palwancha, Khammam, Telangana, crime

The Palvanch businessman and three of his family members in Telangana's Bhadradri Kothagudem district, which created sensation in the state, the Naga Ramakrishna had texted a message to a close friend on his selfie videos, by which the police nabbed Vanama Raghavender Rao the son of TRS MLA Vanama Venkateswara Rao in connection with the suicide.

వనమా అకృత్యాలపై.. రామకృష్ణ సెల్ఫీ వీడియోలు దాచింది ఇక్కడే

Posted: 01/11/2022 11:47 AM IST
Naga ramakrishna text messaged his friend on his selfie videos against trs mla s son

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన వ్యాపారి నాగ రామకృష్ణ.. కుటుంబంతో పాటుగా సామూహిక ఆత్యహత్యకు పాల్పడేందుకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు పైశాచిక చర్యలు, ఒత్తిడులు, బెదిరింపులే కారణమని మృతుడు నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోలే కీలక సాక్ష్యాలుగా మారుతున్నాయి. అయితే ఈ సెల్ఫీ వీడియోలు ఎవరి ద్వారా బయటకు వచ్చాయి అన్న విషయాలతో పాటు వీటి విశ్వసనీయత కూడా న్యాయస్థానాల్లో చర్చకు వచ్చే అంశమై ముందుగానే అలోచించిన రామకృష్ణ.. తాను స్వయంగా రికార్డు చేసిన వీడియోలను ఎక్కడి పెట్టిందన్న విషయాన్ని తన స్నేహితుడికి టెక్ట్స్ మెసెజ్ చేశాడని తేలిసింది.

ఈ మేరకు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నట్లు సమాచారం. వనమా రాఘవ అకృత్యాలు, పైశాచిక చర్యలపై ప్రజలందరికీ తెలిసేందుకు గాను ఓ మిత్రుడి సాయం తీసుకున్న విషయాన్ని కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తన మిత్రుడికి ఓ మెసేజ్ చేస్తూ.. తనను క్షమించాలని, తాను ఓ వీడియో చేసి కారు డ్యాష్ బోర్డులో పెట్టానని తెలిపారు. తన కార్యక్రమాలన్నీ అయిపోయాక 7474 నంబరుతో ఫోన్ అన్‌లాక్ చేసి వీడియో చూసి ఆ తర్వాత అందరికీ పంపాలని, కారు తాళం చెవి బాత్రూంపై పెట్టానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీకు మాత్రమే చెబుతున్నానని రామకృష్ణ పేర్కొన్నారు.

ఈ మెసేజ్ ఆధారంగానే ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు సమర్పించిన ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రామకృష్ణ కారులో ఆత్మహత్య లేఖతోపాటు ఏడు పేజీల అప్పుల కాగితాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, వీటితోపాటు 34 నిమిషాల నిడివి ఉన్న సెల్ఫీ వీడియో ఉన్న ఫోన్‌ను సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాఘవకు కనుక బెయిలు లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడని, సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాగా, రిమాండ్ రిపోర్టుతోపాటు రాఘవపై గతంలో అధికారికంగా నమోదైన 11 కేసుల వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles