Goa minister Lobo, another MLA quit BJP గోవా బీజేపికి షాకిచ్చిన మంత్రి, ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లో చేరికకు..

Goa minister quits before polls bjp no more party of common people

Shock to BJP, Michael Lobo, election news, Goa Assembly Elections 2021, Goa, elections, Minister resigns to party, BJP, Congress

Goa minister Michael Lobo quit the BJP today, just a month before polls in the state, saying it is "no longer a party for the common man". The BJP said "a few defections" driven by greed would not hurt the party at all. Reports suggest he is heading to the Congress in a reversal of the trend in the past few years.

గోవా బీజేపికి షాకిచ్చిన మంత్రి, ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లో చేరికకు..

Posted: 01/10/2022 09:43 PM IST
Goa minister quits before polls bjp no more party of common people

గోవాలో పాల‌క‌ప‌క్ష‌మైన బీజేపీకి సరిగ్గా ఎన్నికల వేళ గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. బీజేపికి చెందిన ఇద్ద‌రు ముఖ్యనేత‌లు పార్టీకి గట్టి జలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న నేత కూడా కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో గోవాలో తమ విజయం ఖాయమని గత కొద్ది రోజులుగా చెప్పుకున్న బీజేపీ నేత‌లు షాక్‌లో మునిగిపోయారు. ఎమ్మెల్యే ప్ర‌వీణ్ జంత్యే బీజేపీకి గుడ్ బై చెప్ప‌గా, మంత్రి మైఖేల్ లోబో కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ సామాన్యుల పార్టీ కాద‌ని, అందుకే గుడ్ బై చెప్పేస్తున్నాన‌ని లోబో ప్ర‌క‌టించారు.

మాజీ సీఎం ప‌ర్రీక‌ర్ ఆలోచ‌న విధానంతో పార్టీ న‌డ‌వ‌డం లేద‌ని, ఆయ‌న వ‌ర్గీయుల‌కు ప్ర‌స్తుత నాయ‌క‌త్వం అంత‌గా గౌర‌వించ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. త‌మతో ప్ర‌స్తుత నాయ‌క‌త్వం గౌర‌వ‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆరోపించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్న‌ది ఇద‌మిత్థంగా పేర్కొన‌లేదు. ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చ‌లు జరుపుతున్న‌ట్లు మాత్రం ప్ర‌క‌టించారు. ఆయ‌న స‌న్నిహితులు మాత్రం లోబో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతార‌ని పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. దీంతో గోవాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండగా, అధికార బీజేపి పార్టీకి మాత్రం శరాఘాతం తప్పడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles