Tirumala Tirupati Devasthanam loose foreign donations వడ్డీ కాసులవాడికి విదేశీ విరాళాలు దూరం చేసిన కేంద్రం..

Tirumala temple and 1 530 ngos trusts in telugu states lose their fcra licences

Tirumala Tirupati Devasthanam, Mission Kakatiya Trust, TTD Trust, Sri Sathya Sai Medical Trust, GVK Emergency Research Institute, Foreign Contribution (Regulation) Act (FCRA), Chiranjeevi Charitable Trust, Union ministry of home, Mother Teresa's Missionaries of Charity, Telangana, Andhra Pradesh, Sri Vari darshanam, Tirumala Darshanam, Lord Balaji darshan, Lord Venkateshwara swamy darshanam, YV SubbaReddy, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, Tirumala darshan, TTD Board, Dharma reddy, devotional

Mission Kakatiya Trust of Telangana government, the TTD Trust and the Sri Sathya Sai Medical Trust in Prasanthi Nilayam are among 1,530 well-known NGOs and trusts from Telangana and Andhra Pradesh that got their licences under the Foreign Contribution (Regulation) Act (FCRA) cancelled for failing to comply with revised guidelines or apply for renewal on time.

వడ్డీ కాసులవాడికి విదేశీ విరాళాలు దూరం.. ఎఫ్సిఆర్ఏ లైసెన్సు పునరుద్దరించని కేంద్రం..

Posted: 01/04/2022 09:43 PM IST
Tirumala temple and 1 530 ngos trusts in telugu states lose their fcra licences

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. తిరుమల శ్రీవారిపై అమితమైన భక్తితో విదేశాల నుంచి శ్రీవారి భక్తులు అందించే విరాళాలను స్వీకరించేందుకు కేంద్రం మెకాలడ్డింది. దేశవిదేశాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు శ్రీవారి దర్శనం చేసుకోకపోయినా.. కనీసం శ్రీవారికి తమ వంతుగా విరాళాలను అందిస్తూనే ఉంటారు. అయితే ఇలా అందించే విదేశీ విరాళాలను స్వీకరించేందుకు టీటీడీకి ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్‌ ఉండాలి. అయితే ఈ లైసెన్సుతోనే ఇన్నాల్లు విరాళాలను అందుకున్న టీటీడీ.. తాజాగా రెన్యువల్‌ ను మాత్రం చేసుకోలేదు.

అందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ సవరణలే పెద్ద కారణం. తాజాగా ఈ యాక్టులో సవరణలు చేసిన కేంద్రం.. సవరణల మేరకు లైసెన్సు చేసుకోవాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్జీవోలు, ట్రస్టులతో పాటు టీటీడీ దేవాలయాన్ని కూడా అదేశించింది. అయితే తాజా సవరణల మేరకు టీటీడీ అధికారులు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్టు లైసెన్సును పునరుద్దరణ చేసుకోవడంలో సఫలం కాలేదు. దీంతో టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు బ్రేక్‌ పడింది. దాంతో విదేశీ భక్తుల నుంచి వచ్చే విరాళాలు నిలిచిపోయాయి. స్వచ్ఛంద, మతపరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసే ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ లైసెన్స్‌ తప్పనసరి.

ఒక్కసారి ధరఖాస్తు చేసుకుంటే లైసెన్స్‌ ఐదేండ్ల పాటు కొనసాగనున్నది. టీటీడీ లైసెన్స్‌ గడువు 2020 డిసెంబర్‌తో ముగిసింది. లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్‌ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్‌ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాలు నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles