Online application for COVID-19 ex-gratia కోవిడ్ మృతుల కుటుంబాల నుంచి ధరఖాస్తుల కోరిన ప్రభుత్వం

Telangana govt appeals to fill online application for covid 19 ex gratia

Telangana government, Mee Seva Centers, Covid victim families, ex-gratia payment, financial aid, COVID-19, State Disaster Response Fund, Telangana

The Telangana government has appealed the eligible persons to apply for the ex-gratia payment to the kin of the persons who died due to COVID-19. The government recently announced that it will pay ₹50,000 from the State Disaster Response Fund to the family of the persons who died due to COVID-19.

కోవిడ్ మృతుల కుటుంబాల నుంచి ధరఖాస్తుల కోరిన ప్రభుత్వం

Posted: 01/04/2022 08:59 PM IST
Telangana govt appeals to fill online application for covid 19 ex gratia

కరోనా మహమ్మారితో కుటుంబాలలోని ఆర్జించే వ్యక్తులతో పాటు తమ ఇంటి సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచేందుకు పూనుకుంది. కరోనా బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారంగా రూ.50వేల మత్తాన్ని అందించనున్నది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ  మీ సేవ కేంద్రాల ద్వారా ఎక్స్‌గ్రేషియా కోసం బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు కోరుతుంది. కరోనా బారిన పడి తమ కుటుంబసభ్యులు మరణించారని ధృవీకరించే పత్రాలతో అందజేయాలని తెలిపింది. కరోనాతోనే మృతి చెందినట్టు అధికారిక డాక్యుమెంట్‌, ఇతర ధ్రువీకరణపత్రాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవా కేంద్రాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఆయా పత్రాలతో దరఖాస్తులు అందజేయాలని సూచించింది.

జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కొవిడ్‌ డెత్‌ నిర్ధారణ కమిటీ కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు 040-48560012 ఫోన్‌ నంబరులో, This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. మెయిల్‌లో సంప్రదించాలని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles