Mankind Pharma Launches Anti- COVID-19 pill Molulife మ్యాన్ కైండ్ ఫార్మా నుంచి చౌకధరలో కోవిడ్ మాత్రలు ‘మోలులైఫ్’

Mankind bdr pharma join hands to launch anti covid 19 pill molulife

mankind pharma, mankind pharma news, molnupiravir, covid drug, COVID-19, coronavirus, Molulife, oral anti- COVID pill, lethal mutagenesis, error catastrophe, viral genome, Drugs Controller General of India, DCGI, USFDA, BDR pharma, Antiviral oral pill for COVID, Coronavirus updates

Drug major Mankind Pharma has announced the launch of the oral anti- COVID pill "Molulife"(Molnupiravir 200mg). Molnupiravir is an investigational, orally administered form of a potent ribonucleoside analog, Which inhibits viral propagation through lethal mutagenesis by introducing error catastrophe in the viral genome.

మ్యాన్ కైండ్ ఫార్మా నుంచి చౌకధరలో కోవిడ్ మాత్రలు ‘మోలులైఫ్’

Posted: 01/05/2022 11:22 AM IST
Mankind bdr pharma join hands to launch anti covid 19 pill molulife

కరోనా వైరస్ మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఊరటనిచ్చేలా మ్యాన్ కైండ్ ఫార్మా కీలక అడుగు ముందుకువేసింది. కరోనా రోగుల కోసం నోటి ద్వారా తీసుకునే మాత్రలను ఇటీవల భారత ఢ్రగ్ కంట్రోల్ జనరల్ అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కోర్సుకు కావాల్సిన 40 మాత్రలను దేశంలోని అన్ని ఔషద దుకాణాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక పలు కంపెనీలు ఈ మాత్రలను 3వేల వరకు ధర నిర్ణయించగా, మ్యాన్ కైండ్ ఫార్మా మాత్రం కేవలం 1399కే యాంటీ వైరల్ డ్రగ్ ‘మోలులైఫ్’ను కేవలం 1399కే అందుబాటులోకి తీసుకువచ్చింది.

అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుపిరవిర్ మాత్రలు ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మాత్రలనే మ్యాన్ కైండ్ ఫార్మా మోలు లైఫ్ పేరుతో దేశంలోని కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సాధారణ ఫ్లూ, సహా దగ్గు, జలుబు, జ్వరానికి కొనుక్కుంటున్నట్టుగానే మెడికల్ షాపులో కొవిడ్ మాత్రలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ‘మోలు లైఫ్ (200 ఎంజీ)’ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి. అంటే పూటకు 800 ఎంజీ డోసు అన్నమాట. అయితే, వీటిని వైద్యుల సిఫారసుతోనే వాడాల్సి ఉంటుంది.

కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మాత్రలను మన దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మ్యాన్‌కైండ్ మాత్రం రూ. 1,399కే అందుబాటులోకి తీసుకురాగా, సన్‌ఫార్మా రూ. 1,500, డాక్టర్ రెడ్డీస్ రూ. 1,400 ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమెరికాలో మాత్రం వీటి ధర భారత కరెన్సీలో రూ. 52 వేలు. ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి నిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles