Take pride in using Telugu: CJI NV Ramana పొన్నవరంలో ఎడ్లబండిపై వెళ్లిన సీజేఐ ఎన్వీ రమణ

Chief justice stresses on respecting mother mother tongue and motherland

CJI NV Ramana takes bullock cart ride, CJI Ramana takes bullock cart ride, CJI Ramana takes bullock cart ride video, CJI Ramana visit to native village, Chief Justice Of India, NV ramana, COVID-19, Covaxin, criticised, NV Ramana praised, developed in India, CJI, native village, Covaxin, developed in India, Ponnavaram, Krishna district, Andhra Pradesh, Politics

Chief Justice of India Justice N.V. Ramana took a bullock cart ride during his visit to native village Ponnavaram in Krishna district of Andhra Pradesh. On his first visit to the village after assuming office of the CJI in April this year, he along with his wife took bullock cart ride to reach the village from the outskirts.

సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం.. సంఘటితంతోనే సమస్యలకు స్వస్తి..

Posted: 12/24/2021 05:29 PM IST
Chief justice stresses on respecting mother mother tongue and motherland

దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో పర్యటించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామశివార్ల వరకు కాన్వాయ్ మధ్య వచ్చిన ఆయనను.. సంప్రదాయబద్ద రైతుబిడ్డగా మార్చి.. చిరకాలం గుర్తుండిపోయేలా ఎండ్ల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారిపొడవునా గ్రామస్థులు జస్టిస్‌ ఎన్వీరమణకు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు.

సీజేఐ కోసం గ్రామంలో పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలతో ముస్తాబుచేశారు. పొన్నవరంలో ఆయన కుటుంబానికి పొలాలు ఉన్నాయి. ఆయన పెదనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటోంది. సోదరుడి నివాసంలోనే భోజనం చేశారు. గ్రామంలో దాదాపు నాలుగు గంటల సమయం ఆయన గడిపారు. అక్కడి గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలోనూ ఆయన ప్రసంగించారు. తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. గ్రామస్థులంతా ఐక్యతగా ఉండడం గర్వంగా ఉందని, ఇదే వాతావరణం కొనసాగించాలని, అన్ని కులాలు, మతాలు కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి బాల్య మిత్రుడు శివలింగ ప్రసాద్‌తో కలిసి గ్రామంలో రోడ్లు, చెరువు కట్టలు, పంట పొలాల్లో సంతోషంగా గడిపేవారమని గుర్తుచేశారు. తమ ప్రాంతం చైతన్యం గల ప్రాంతమని అన్నారు. దేశమంతా అభివృద్ధి చెందినప్పటికీ కూడా తమ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదని ఆవేదన తనలో ఉందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కారం అయ్యేదాకా పట్టుదలతో ఉండాలని సూచించారు. తాను ఎక్కడికీ వెళ్లినా తెలుగు వారి గొప్పదనాన్ని అందరూ ప్రశంసిస్తుండడం గర్వంగా ఉందని అన్నారు. అప్ఘానిస్తాన్‌లో పార్లమెంట్ భవనాన్ని కూడా తెలుగు వారే నిర్మించారు.

కరోనా కష్టకాలంలో కరోనా మందును కనుగొన్న తెలుగువారు భారత్‌ బయోటెక్‌ ఎల్లాకృష్ణా, సుచిత్ర దంపతులు కావడం మనందరం గర్వపడాలని అన్నారు. తెలుగు జాతికి సరైనా గుర్తింపులేదని ఆవేదన తనలో ఉందని , అయితే తెలుగు భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను , తెలుగు చైతన్యా న్నిపటిష్ట పరుచుకోవాలని సూచించారు. రైతులందరూ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలు లేకపోవడం, భూ సమస్య వివాదాలు అధిగమించాలంటే ఐక్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు , మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles